ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కదలిన అధికారులు
ABN, Publish Date - May 21 , 2025 | 12:02 AM
మంథని మున్సిపల్ పరిధి లోని ప్రభుత్వ భూముల ఆక్రమణ పై మున్సిపల్, రెవె న్యూ అధికార యంత్రాంగంలో కదలికలు మొదలయ్యాయి. ప్రభు త్వ భూములకు రక్షణ కరువు అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు కబ్జాలపై ఆరా తీశారు.
మంథని, మే 20 (ఆంధ్రజ్యోతి): మంథని మున్సిపల్ పరిధి లోని విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణ పై మున్సిపల్, రెవె న్యూ అధికార యంత్రాంగంలో కదలికలు మొదలయ్యాయి. ప్రభు త్వ భూములకు రక్షణ కరువు అనే శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు కబ్జాలపై ఆరా తీశారు. కాటారం-మంథని ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న సర్వే నెం. 314లో ప్రభుత్వ భూమిలో రెండు అంతస్తుల్లో భవనం నిర్మించిన కుర్రు సారమ్మకు గతంలో మున్సిపల్ ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులను రద్దు చేస్తూ మంగళవారం నోటీసు జారీ చేశామని మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు.
స్థలం స్వాధీనం కోసం ఈ విషయాన్ని తహసీల్దార్ కార్యాలయం నోటీసులో ప్రదర్శించామన్నారు. సూరయ్యపల్లిరోడ్‌లో, మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారికి ఇరువైపుల పాత పెట్రోల్ పంపు నుంచి కూచిరాజ్‌పల్లి వరకు మున్సిపల్ పరిధిలో విలువైన ప్రభుత్వ భూముల కబ్జాలను గుర్తించి వాటిని తొలగించి భూముల పరిక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మంథని ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించారు. దీంతో వారు ప్రభు త్వ భూముల ఆక్రమణపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు విలువైన ప్రభుత్వ భూముల్లో ఆక్ర మ ణలు తొలగించి వాటి పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - May 21 , 2025 | 12:02 AM