ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధులతో పలు అభివృద్ధి పనులు

ABN, Publish Date - May 07 , 2025 | 11:39 PM

రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 1వ డివిజన్‌ ఏరియా విలేజీ రామగుండంలో ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.20లక్షలతో నిర్మించ తలపెట్టిన వాటర్‌ ప్లాంట్‌, శ్మశాన వాటిక నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాగూర్‌, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణు గోపాల్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు.

అంతర్గాం, మే 7(ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 1వ డివిజన్‌ ఏరియా విలేజీ రామగుండంలో ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.20లక్షలతో నిర్మించ తలపెట్టిన వాటర్‌ ప్లాంట్‌, శ్మశాన వాటిక నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాగూర్‌, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణు గోపాల్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజల సం క్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని పేర్కొన్నారు. ఎన్‌టీపీసీ సంస్థ పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో అభివృద్దికి పాటుపడుతుందన్నారు. వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణంతో స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రభు త్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ అరు ణశ్రీ, నాయకులు బొంతల రాజేష్‌, ఈదునూరి హరి ప్రసాద్‌, ఎండీ వాజీద్‌ ఖాన్‌, పూదరి సత్తయ్యగౌడ్‌, పల్లికొండ శ్యామ్‌, సింగం కిరణ్‌గౌడ్‌, పాల్గొన్నారు.

హెల్మెట్‌తోనే రక్షణ

కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమైతే ప్రాణాలు పోతాయని, హెల్మెట్‌తో ప్రాణా లను కాపాడుకోవచ్చని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠా కూర్‌ పేర్కొన్నారు. గోదావరిఖని మెయిన్‌ చౌరస్తాలో రామగుండం ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్‌ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సి పల్‌ కార్మికులు, ప్రైవేట్‌ ఉద్యోగులు, ప్రైవేట్‌ టీచర్లు తదితరులకు ఆయన హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ద్వి చక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్‌ ధరించాలని, కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా పోలీసులు కూడా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో నుంచి వాహనాలు తీసే సమయంలోనే హెల్మెట్‌ అందిం చాలన్నారు. ద్విచక్ర వాహనదా రులకు రోజు వారీ జీవితంలో హెల్మెట్‌ అనేది భాగం చేసుకోవాలన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించడమే కాకుండా సామాజిక బాధ్యతగా మానవతా దృక్పథంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హెల్మెట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. హెల్మెట్‌ తీసుకు న్న ప్రతి ఒక్కరూ ధరించాలని సూచించారు. అడిషల్‌ డీసీపీ(అడ్మిన్‌) సీ రాజు, ఏసీపీ ఎం రమేష్‌, ట్రాఫిక్‌ ఏసీపీ జాన్‌ నర్సింహులు, ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్‌బీఐ రీజినల్‌ మేనేజర్‌ రవీంద్రకుమార్‌ సింగ్‌, అమరేందర్‌, అదర్‌ సండే సమ్మారావు, పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 11:39 PM