బీఆర్‌ఎస్ హయాంలో ఏ ఒక్క మేలు జరగలేదు
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:26 AM
పదేళ్ళ బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలకు ఏ ఒక్క మేలు జరుగలేదని, ప్రజలు వంచనకు గురయ్యారని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. నర్సయ్యపల్లి, గాంధీన గర్ గ్రామాలలో రూ.33 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిం చారు.
సుల్తానాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): పదేళ్ళ బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలకు ఏ ఒక్క మేలు జరుగలేదని, ప్రజలు వంచనకు గురయ్యారని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. నర్సయ్యపల్లి, గాంధీన గర్ గ్రామాలలో రూ.33 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిం చారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదా రులకు మంజూరు పత్రాలను అందజేస్తూ ముగ్గులు పోశారు. అనంతరం ఏర్పాటు చేసి న సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతు పదే ళ్ళలో ఎవరికీ ఇల్లు రాలేదని, పెన్షన్ ఇవ్వ లేదని, డబుల్ బెడ్ రూం ఆశ పెట్టి ప్రజలను మోసం చేసి అధికారం లోకి వచ్చి పదవులను అనుభవించారన్నారు. కాం గ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ఏడాదిన్నరలోనే అనే క సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.
గ్రామస్థుల కోరిక మేరకు పెద్ద మ్మ గుడి ప్రహరీ, మహిళా సంఘం భవనా నికి నిధులు కేటాయిస్తానని హమీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులును గెలిపించాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, తిరుమల్ రావు, రాములు, దామోదర్ రావు, మహేందర్, రాజలింగం, సతీష్, అబ్బ య్యగౌడ్, జానీ, వెంకటేశం, తహసీల్దార్ బషీరొద్దిన్, ఎంపీ డీఓ దివ్యదర్శన్ రావు, ఎండీ అంకశావలి తదితరులు పాల్గొన్నారు.
- ఎమ్మెల్యే విజయరమణారావు
Updated Date - Jul 02 , 2025 | 12:26 AM