సోలార్ ప్లాంట్ వద్దు
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:12 AM
రాఘవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 1072లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని మంగళవారం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. శ్మశానవాటికకు కేటాయించిన భూమిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు నిలిపివేయాలన్నారు.
పెద్దపల్లి రూరల్ , జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాఘవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 1072లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని మంగళవారం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. శ్మశానవాటికకు కేటాయించిన భూమిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు నిలిపివేయాలన్నారు. ఈ సందర్భంగా సోలార్ ప్రాజెక్టు నిర్మాణం వద్దకు గ్రామస్థులు చేరుకోని ఆందోళన చేపట్టారు. వందలాది ఎకరాల్లో భూమి ఉండగా శ్మశానవాటిక ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు. అస్థికలు బయటపడటంతోపాటు ,సమాధులు ధ్వంసం చేస్తున్నారన్నారు.
వెంటనే ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేసి ఇతర ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నారు. ఆందోళన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వేణుకు వినతిపత్రం అందించారు. గ్రామస్థులు మార్కు లక్ష్మణ్, అర్కుటి రామస్వామి, తాడిశెట్టి శ్రీకాంత్, అనంతగిరి కొమురయ్య, కల్లేపల్లి అశోక్, మోదుంపల్లి శ్రావణ్, కుమ్మరి నవీన్, సదయ్య, సతీష్, భిక్షపతి, సాగర్, శంకర్, సదయ్య, గుండా శ్రీనివాస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 12:12 AM