ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెడికల్‌ కాలేజీపై ఎన్‌ఎంసీ అసంతృప్తి

ABN, Publish Date - Jun 20 , 2025 | 12:49 AM

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణపై జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల విస్తరణలో భాగంగా 2020లో జగిత్యాలలో మెడికల్‌ కాలేజీకి జాతీయ వైద్య కమిషన్‌ అనుమతులు మంజూరు చేసింది.

జగిత్యాల, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణపై జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల విస్తరణలో భాగంగా 2020లో జగిత్యాలలో మెడికల్‌ కాలేజీకి జాతీయ వైద్య కమిషన్‌ అనుమతులు మంజూరు చేసింది. అదే ఏడాది ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో 150 సీట్లు కేటాయించారు. జగిత్యాల పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ క్యాంపులో ఆగ్రోస్‌ గోదాముల్లో మెడికల్‌ కాలేజీ కోసం 27 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ప్రిన్సిపాల్‌, స్టాఫ్‌ గదులు, తరగతి గదులతో 2022 మార్చిలో కాలేజీని ప్రారంభించారు. ప్రస్తుతం మూడో సంవత్సరం బ్యాచ్‌ కొనసాగుతోంది. కాలేజీకి అనుబంధంగా జిల్లా ఆస్పత్రిని 350 పడకలతో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిగా, మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని 150 పడకలతో అనుబంధంగా కొనసాగిస్తున్నారు.

ఫఎన్‌ఎంసీ తనిఖీల్లో లోపాలు బహిర్గతం

2023లో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లకు ముందు ఎన్‌ఎంసీ నిర్వహించిన తనిఖీల్లో కాలేజీ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. రేకుల గోదాముల్లో కాలేజీ నిర్వహణ, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సరైన వార్డులు, ల్యాబ్‌లు, మౌలిక వసతుల లేమిపై ఎన్‌ఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలి తనిఖీల్లోనూ ఇవే లోపాలను గుర్తించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపుపై అనిశ్చితి నెలకొంది. ఇటీవల ఢిల్లీలో జరిగే విచారణకు ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్య సంచాలకులు యూజీ ఎంఈబీ డైరెక్టర్‌ హాజరు కావాలని ఎన్‌ఎంసీ ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో కొత్తగా ఏర్పడిన 27 కళాశాలల్లో ఎన్‌ఎంసీకి అనుగుణంగా వసతులు లేవని తేలింది. ఇందులో జగిత్యాల వైద్య కళాశాల సైతం ఉంది.

ఫనిర్మాణ పనుల్లో జాప్యం..

ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ క్యాంపులో మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. మెడికల్‌ కళాశాల భవనాల పనులకు గత ప్రభుత్వం రూ.132 కోట్లు నిధులు మంజూరు చేసింది. కళాశాల అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, బాలుర వసతి గృహం, బాలికల వసతి గృహం, పర్యవేక్షకుల గదులు, అంతర్గత రహదారులు, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ తదితర పనులకు ఆయా నిధులు వెచ్చించాల్సి ఉంది. మూడు దశల్లో పనులు పూర్తి చేయడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి దశగా రూ.14 కోట్లు వెచ్చించి కళాశాల తరగతుల నిర్వహణ, తాత్కాలిక భవనాల ఏర్పాటు, ఇతర భవనాల అభివృద్ధి తదితర పనులను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లులు కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం చెల్లింపు జరిపింది. రెండో దశలో భాగంగా రూ.115 కోట్ల నిధులతో మెడికల్‌ కళాశాల భవన నిర్మాణం, బాలుర, బాలికల వసతిగృహాలు నిర్మించాల్సి ఉంది. ప్రభుత్వం మారడం, నిధుల కేటాయింపులు లేకపోవడంతో పనులపై తీవ్ర ప్రభావం చూపింది. కళాశాల ప్రధాన భవనాల పనులు తుది దశకు చేరాయి.

ఫకాంట్రాక్టర్‌కు బిల్లులు రాక నిలిచిన పనులు

మెడికల్‌ కళాశాలకు సంబంధించి ఇప్పటివరకు రూ.60 కోట్లకు సంబంధించిన పనులు పూర్తి చేశారు. అందులో రూ.49.80 కోట్ల పనులు బిల్లులు చెల్లింపులు జరగకపోవడంతో కాంట్రాక్టర్‌ ఆరు నెలలుగా పనులు నిలిపివేశాడు. ప్రస్తుతం మెడికల్‌ కళాశాల భవనానికి సంబంధించిన స్లాబ్‌లు, బ్రిక్స్‌ వర్క్స్‌ పూర్తయ్యాయి. బాలుర, బాలికల వసతి గృహాలకు సంబంధించిన స్లాబ్‌ నిర్మాణాలు జరిగినప్పటికీ బ్రిక్స్‌ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. రెండో దశ పనులు పూర్తయితే మూడో దశలో మెడికల్‌ కళాశాల అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ నిర్మాణం, ల్యాబ్స్‌ నిర్మాణం, ప్రిన్సిపాల్‌, ఆయా డిపార్ట్‌మెంట్‌ హెడ్స్‌కు క్వార్టర్స్‌ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను సుమారు రూ. 60 కోట్లతో జరపాలన్న అంచనా ఉంది. అయితే రెండో దశలో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 18 నెలల్లో పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా విధించారు. ఆ దిశగా పనులు కొనసాగకపోవడంతో 2024 డిసెంబరు 31వ తేదీ వరకు గడువును పొడిగించారు. నిధుల కొరతతో గత యేడాది డిసెంబరు నెలాఖరు వరకు పనులు పూర్తి కాలేదు. దీంతో మూడోసారి పనుల గడువును పొడిగించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో భవనాలు అందుబాటులోకి రాలేదు. ఈ ఆలస్యం ఎన్‌ఎంసీ అసంతృప్తికి కారణమైంది.

ఫవసతుల లేమి..

ప్రస్తుత కాలేజీలో అధ్యాపకులు, ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు, సీసీ టీవీ వంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు అవసరమైన ప్రాక్టికల్‌ శిక్షణకు తగిన రోగుల మృతదేహాలు, వివిధ విభాగాలకు చెందిన వైద్య సౌకర్యాలు లేవు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు, ఆర్థోసేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల వ్యాధులపై ప్రాక్టికల్‌ అవగాహన కోసం అవసరమైన సౌకర్యాలు లేకపోవడం విద్యార్థుల విద్యను ప్రభావితం చేస్తోంది. బాలుర వసతి గృహాన్ని కృష్ణానగర్‌లో గల ఓ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. బాలికల వసతి గృహాన్ని నర్సింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్నారు.

ఫమరో ఆరు నెలలు..

వచ్చే ఏడాది కల్లా కొత్త భవనం, 500 పడకలతో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి పూర్తయితే ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా కాలేజీ నిర్వహణ సాధ్యమవుతుంది. అయితే, నూతన భవనం అందుబాటులోకి రావడానికి మరో ఆరు నెలలకు పైగా సమయం పట్టనుంది. ఈ ఏడాది ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపుపై ఎన్‌ఎంసీ అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది. అధికారులు సీట్ల అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నప్లటికీ వసతుల ఏర్పాటుకు సవాళ్లు తప్పేలా లేవు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని జగిత్యాల ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఎన్‌ఎంసీ నోటీసులకు సమాధానం ఇచ్చాం

-సైఫ్‌ ఖాద్రీ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌, జగిత్యాల

ఇటీవల రాష్ట్రంలోని దాదాపు అన్ని కొత్త వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ నోటీసులు వచ్చాయి. దానికి అనుగుణంగా నోటీసులకు సరియైున సమాధానం ఇచ్చాం. కళాశాలలో పూర్తి స్థాయి ఫ్యాకల్టీ లేని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లాం. అందుబాటులో ఉన్న వనరులతో కళాశాలను ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.

Updated Date - Jun 20 , 2025 | 12:49 AM