ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

త్వరలో నవ జాత శిశు కేంద్రం ప్రారంభం

ABN, Publish Date - Apr 03 , 2025 | 11:22 PM

త్వరలోనే పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో నవ జాత శిశు కేంద్రం ప్రారంభిస్తామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం కలెక్టర్‌ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నవజాత శిశు కేంద్రం ఏర్పాటుకు వచ్చిన పరికరాలను కలెక్టర్‌ పరిశీలించారు.

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): త్వరలోనే పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో నవ జాత శిశు కేంద్రం ప్రారంభిస్తామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం కలెక్టర్‌ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నవజాత శిశు కేంద్రం ఏర్పాటుకు వచ్చిన పరికరాలను కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ ఐఓసిఎల్‌ సంస్థ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్‌) కింద పరికరాలను అందించారని కలెక్టర్‌ తెలిపారు. నవజాత శిశు కేం ద్రం ఏర్పాటుకు అవసరమైన రూ.35 లక్షల విలువ చేసే వివిధ వైద్య పరికరాలు మాత శిశు ఆసుపత్రికి చేరుకున్నాయని, వీటిని త్వరగా అమర్చి ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ అన్న ప్రసన్నకుమారి, పిల్లల వైద్య నిపుణులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 11:22 PM