కేజీబీవీల్లో కొత్త రుచులు
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:54 AM
నిరుపేద బాలికలకు అందుబాటులో నాణ్యమైన విద్యతో పాటు బలవర్ధక ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కొత్త మెనూను అమల్లోకి తెచ్చింది. బాలికలు మధ్యలో చదువు ఆపేయకుండా, వారిని అక్కున చేర్చుకుని కేజీబీవీలు వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.
జగిత్యాల, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): నిరుపేద బాలికలకు అందుబాటులో నాణ్యమైన విద్యతో పాటు బలవర్ధక ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కొత్త మెనూను అమల్లోకి తెచ్చింది. బాలికలు మధ్యలో చదువు ఆపేయకుండా, వారిని అక్కున చేర్చుకుని కేజీబీవీలు వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. కస్తూర్బాల్లో చదివే బాలికలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఉంటారు. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడంతో రక్తహీనతతో బాధపడుతుంటారు. గురుకులాల్లో అమలయ్యే ఆహార మెనూ కేజీబీవీల్లో లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న మెనూలో పలు మార్పులు చేసింది. దీంతో 2025-2026 విద్యా సంవత్సరంలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. జిల్లాలో 16 కేజీబీవీల్లో కొత్త మెనూను అమలు చేస్తున్నారు. వీటితో పాటు 12 కేజీబీవీ ఇంటర్ కళాశాలల్లో నూతన మెనూ అమలు చేస్తున్నారు.
ఫపెరిగిన మెస్ చార్జీలు..
గతంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్ విద్యార్థులందరికీ ఒకే విధంగా నెలకు రూ.1,225లను ప్రభుత్వం అందించేది. కానీ ప్రస్తుతం నూతన మెనూ ప్రకారం 6వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,330, ఎనిమిదో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నెలకు రూ.1,540లు, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.2,100 అందించనున్నారు.
ఫనూతన మెనూ ఇదే..
ఉదయం... టమాట, కిచిడీ, సాంబారు, బూస్టు, పూరి, రాగి జావ, ఉప్మా, పులిహోర, వడ, బోండా, చపాతి, జీరా రైస్‌తో పాటు రోజుకు ఒక్కోరకమైన పండ్లు అందిస్తున్నారు. ఇందులో అరటి పండ్లు, జామ, వాటర్ మిలన్, బొప్పాయి, సపోటా వంటి పండ్లు ఉంటాయి.
మధ్యాహ్నం.. టమాట పప్పుతో కూడిన అన్నం, నెయ్యి, రసం, పెరుగు అందిస్తారు.
సాయంత్రం... ఉడక బెట్టిన శనగలు, కోడి గుడ్డు, బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయి, మిల్లెట్ బిస్కెట్, పకోడి ఇస్తారు.
రాత్రి.. వివిధ రకాల కూరలతో తయారు చేసిన అన్నం, సాంబారు, మజ్జిగ అందిస్తారు. నెలలో రెండుసార్లు మటన్, ఐదు సార్లు గుడ్లు, ప్రతీ రోజు నెయ్యి అందిస్తారు. ను ఏర్పాటు చేశాం.
Updated Date - Jun 25 , 2025 | 12:54 AM