ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యల పరిష్కారానికి దేశ వ్యాప్త ఉద్యమం

ABN, Publish Date - Jul 27 , 2025 | 11:46 PM

బొగ్గు పరిశ్రమ సమస్యల పరి ష్కారానికి బీఎంఎస్‌ దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్టు సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. ఆదివారం యూనియన్‌ ఆఫీస్‌లో ఉద్యమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

యైుటింక్లయిన్‌కాలనీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): బొగ్గు పరిశ్రమ సమస్యల పరి ష్కారానికి బీఎంఎస్‌ దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్టు సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. ఆదివారం యూనియన్‌ ఆఫీస్‌లో ఉద్యమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సత్తయ్య మాట్లాడారు. బొగ్గు పరిశ్రమల్లో 50శాతం పర్మినెంట్‌ కార్మికులు ఉండేలా ఆయా కంపెనీలు చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టు కార్మికులకు హైపవర్‌ వేతనాలు అమలు చేయడం, బొగ్గు సం స్థల్లో వైద్య సదుపాయాల కోసం సూపర్‌ స్పెషా లిటీ ఆసుపత్రులను నిర్మించాలని, సీఎంపీఎఫ్‌ వ్యవస్థను ఆన్‌లైన్‌ చేసి పెన్షన్‌ సమస్యలను పరి ష్కరించాలనే డిమాండ్లతో ఆందోళనలు చేపట్టను న్నట్టు ఆయన పేర్కొన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.39,661 కోట్ల బకాయిలను చెల్లించాలని, కోల్‌ఇండియా మాదిరిగా సింగరేణిలో యూనియన్‌ వెరిఫికేషన్‌ విధానాన్ని అమలు చేయాలని, పెర్స్క్‌పై ఐటీని రీయింబర్స్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 12 ఏళ్ళుగా తెలంగాణలో కనీస వేతన సవరణ జరగలేదని, కోల్‌ ఇండి యాలలో కాంట్రాక్టు కార్మికులకు హైపవర్‌ వేతనాలు ఇస్తున్నా సింగరేణిలో అమలు చేయడం లేదని తెలిపారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. యాజమాన్యం, అధికారులు రాజకీయ నాయకులకు వత్తాసు పలకకుండా నిబంధనల ప్రకారం పని చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ జనరల్‌ సెక్రెటరీ సారంగ పాణి, నాయకులు వేణుగోపాల్‌రావు, వడ్డెపల్లి కుమారస్వామి, మాదాసి రవీందర్‌, గట్టు శ్రీనివాస్‌, నీలం రవి, శ్రీనివాస్‌, మల్లారెడ్డి, కోటయ్య, లింగంనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:46 PM