ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఓసీపీ-2 బ్లాస్టింగ్‌లతో దద్దరిల్లిన నాగేపల్లి సీ-బ్లాక్‌

ABN, Publish Date - May 15 , 2025 | 11:48 PM

సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్‌ పరి ధిలోని ఓసీపీ-2 డైవర్ట్‌ కెనాల్‌లో గురువారం చేపట్టిన బ్లాస్టింగ్‌తో నాగే పల్లి సీ-బ్లాక్‌ ఒక్కసారిగా దద్దరిల్లింది. ప్రాజెక్టు ఓబి కుప్పలకు ఆను కొని ఉన్న నాగేపల్లి సీ-బ్లాక్‌లో సింగరేణి చేపట్టిన భారీ పేలుళ్ళతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేలుళ్ళకు పెద్ద, పెద్ద బండరాళ్లు సి-బ్లాక్‌లో ఉన్న పలు గృహాలపై పడ్డాయి. వేగంగా వచ్చిన రాళ్లు ఇంటి పై కప్పు రేకులు పగిలి ఇంట్లో పడ్డాయి.

రామగిరి, మే 15(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్‌ పరి ధిలోని ఓసీపీ-2 డైవర్ట్‌ కెనాల్‌లో గురువారం చేపట్టిన బ్లాస్టింగ్‌తో నాగే పల్లి సీ-బ్లాక్‌ ఒక్కసారిగా దద్దరిల్లింది. ప్రాజెక్టు ఓబి కుప్పలకు ఆను కొని ఉన్న నాగేపల్లి సీ-బ్లాక్‌లో సింగరేణి చేపట్టిన భారీ పేలుళ్ళతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేలుళ్ళకు పెద్ద, పెద్ద బండరాళ్లు సి-బ్లాక్‌లో ఉన్న పలు గృహాలపై పడ్డాయి. వేగంగా వచ్చిన రాళ్లు ఇంటి పై కప్పు రేకులు పగిలి ఇంట్లో పడ్డాయి. రాళ్ళు ధాటికి పలువురు స్వల్పంగా గాయపడ్డారు. తొలుత భూకంపంగా భావించిన గ్రామస్థులు పరుగులు పెట్టారు. ఇంట్లో ఉండే గృహోపకరణలు సైతం రాళ్ళ ధాటికి పగిలిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌ చేపట్టారని గ్రామ స్థులు పెద్దపల్లి- మంథని ప్రధాన రహదారి పై సుమారు గంటపాటు రాస్తారోకో చేపట్టారు. సింగరేణికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఆర్జీ-3 జీఎం సుధాకర్‌రావు, రామగుండం ఏసీపీ మడత రమేశ్‌, మంథని సీఐ రాజు, ఎస్‌ఐ చంద్ర కుమార్‌లు ఘటన స్థలానికి చేరుకొని బ్లాస్టింగ్‌లతో దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. అనంతరం గ్రామస్థులతో సమావేశ మయ్యారు. సింగరేణి యాజమాన్యం తరుఫున అధికారుల బృందం ఏర్పాటు చేసి నష్టపోయిన బాధితులకు ఇబ్బందులు లేకుండా మరమ్మతులు చేయిస్తామని జీఎం సుధాకర్‌రావు హామీనిచ్చారు. గాయపడిన వ్యక్తులకు స్థానికంగా వైద్య పరీ క్షలు చేయించారు. గృహోపకరణలను సైతం కల్పిస్తామని హామీ నిచ్చారు. దీంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.

Updated Date - May 15 , 2025 | 11:48 PM