నిరుపేదల సమస్యలపై ఎమ్మార్పీఎస్ పోరాటం
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:29 PM
నిరుపేదల సమస్యలపై ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని, దేశంలో ఎదురయ్యే సవాళ్ళనే ఎదుర్కొవడమే తన భవిష్యత్ ప్రయాణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణమాదిగ అన్నారు. సింగరేణి మాదిగ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మార్కండేయకాలనీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ప్రసంగించారు.
గోదావరిఖని, జూలై 25(ఆంధ్రజ్యోతి): నిరుపేదల సమస్యలపై ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని, దేశంలో ఎదురయ్యే సవాళ్ళనే ఎదుర్కొవడమే తన భవిష్యత్ ప్రయాణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణమాదిగ అన్నారు. సింగరేణి మాదిగ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మార్కండేయకాలనీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ప్రసంగించారు. ఏబీసీడీ వర్గీకరణ కోసమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల నిరుపేదల సమస్యలపై ఎమ్మార్పీఎస్ పోరాటం చేసి పరిష్కరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎన్నో వాగ్ధానాలు నిలబెట్టుకోవడం లేదన్నారు. వికలాంగులకు, వితంతులకు పెన్షన్లు పెంచలేదని, కనీసం ఇవ్వాల్సిన పెన్షన్ల ఇంత వరకు ఇవ్వడం లేదని, ఈ విషయంలో ప్రతిపక్షం ప్రశ్నించడం లేదన్నారు. ఐదేళ్ళుగా కొత్త పెన్షన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పేదవర్గాల సమస్యలే ఎమ్మార్పీఎస్ ఏజెండాగా మారుతుందని, ఆగస్టు 13న వికలాంగుల, వృద్ధుల, వితంతుల పెన్షన్ల కోసం మహాగర్జన నిర్వహిస్తామని, హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పటికైనా పెన్షన్ పెంచుతావా లేకపోతే రాజీనామా చేసి పోతావా అనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తేల్చుకోవడ ం కోసమే మహాగర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా సామాజిక న్యాయమనే ఏజెండా ఉంటుందని, ఆర్థిక అసమానతల రూపుమాపడం కోసం పోరాటం ఉంటుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఫూలే, బాబుజగ్జీవన్‌రాంలు కన్న నూతన సమాజం కోసం భవిష్యత్ పోరాటాలు ఉంటాయన్నారు. తన పద్మశ్రీ రావడం అనేది ఏబీసీడీ వర్గీకరణతో రాలేదని, 30 ఏళ్ళు ఎమ్మార్పీఎస్ చేసిన సామాజిక పోరాటాలకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు అన్నారు. అనంతరం మందకృష్ణ మాదిగను ఘనంగా సన్మానించారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అంబేద్కర్ విగ్రహానికి మందకృష్ణమాదిగ పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, మాజీ ఎంపీ వెంకటేష్‌నేత, తిరుపతి, యాదగిరి సత్తయ్య, బొంకూరి శంకర్, తిరుపతి, పాముకుంట్ల భాస్కర్, యుగేందర్, బాలసాని స్వామిగౌడ్, కాసిపేట శివాజీ, ప్రసాద్‌తో పాటు దళిత సంఘాలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 11:29 PM