ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి చర్యలు

ABN, Publish Date - Jul 04 , 2025 | 11:55 PM

విద్యార్థుల సమగ్రా భివృద్ధికి ఆత్మీయతా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రాజెక్టు అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పెద్దపల్లి కల్చరల్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సమగ్రా భివృద్ధికి ఆత్మీయతా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రాజెక్టు అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు శక్తి అమలు కోసం జిల్లాలో చేపట్టిన పలు కార్యక్రమాలను కలెక్టర్‌కు అధికారులు వివరిం చారు.

అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు తమ పాఠశా లలను సురక్షిత, గౌరవ స్థలాలుగా భావించేలా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో ఆత్మీయతాభావం పెంచడమే లక్ష్యమన్నారు. విద్యార్థుల్లో తారతమ్యం లేకుండా తరగతులు, పాఠశాల కార్యకలాపాల్లో సమానంగా పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో ఒక ఉన్నత భావన కలిగి, వారు అన్నింట్లో ముందుంటారని, హెడ్‌మాస్టర్‌, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించా లని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులు పాఠశాలలకు రోజు వస్తార న్నారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తు న్నామ న్నారు. జిల్లా విద్యాధికారి మాధవి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 11:55 PM