ఎన్టీపీసీలో ముగిసిన మజ్దూర్ మహా సంఘ్ సభలు
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:45 PM
రామగుండం ఎన్టీపీసీ పీటీఎస్‌లోని జ్యోతి ఫంక్షన్ హాలులో రెండు రోజులుగా నిర్వహించిన ఎన్టీపీసీ మజ్దూర్ మహా సంఘ్(బీఎంఎస్) 12వ త్రైమాసిక సభలు ఆదివారం ముగిశాయి. సభలలో వివిధ ఎన్టీపీసీ ప్రాజెక్టుల నుంచి 70 మంది బీఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.
జ్యోతినగర్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎన్టీపీసీ పీటీఎస్‌లోని జ్యోతి ఫంక్షన్ హాలులో రెండు రోజులుగా నిర్వహించిన ఎన్టీపీసీ మజ్దూర్ మహా సంఘ్(బీఎంఎస్) 12వ త్రైమాసిక సభలు ఆదివారం ముగిశాయి. సభలలో వివిధ ఎన్టీపీసీ ప్రాజెక్టుల నుంచి 70 మంది బీఎంఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. వివిధ అంశాలపై తీర్మానాలను సభ ఆమోదించింది. పీఎఫ్‌పై వార్షిక వడ్డీ 2.5 లక్షలకుపైగా వడ్డీని రద్దు చేయాలని, ఉద్యోగులు వదవీ విరమణ చేసిన తరువాత వర్తించే పీఆర్‌ఎంఎస్(వైద్య సౌకర్యం) పరిధి 15 ఏళ్ల సర్వీసు నుంచి 5 సంవత్సరాలకు కుదించాలని తీర్మానించారు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, రానున్న మూడేళ్లలో ఎన్టీపీసీలో భారీగా ఉద్యోగుల రిటైర్మెంట్లు ఉన్నందున ఖాళీలకు సంబంధించి వర్క్‌మెన్ కేటగిరి ఉద్యోగ నియామకాలు చేయాలని, ప్రాజెక్టుల్లో శాశ్వత పని స్థలాలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయాలని తీర్మానించారు. మహా సంఘ్ సభలలో బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎన్‌బీసీ సభ్యుడు సుంకరి మల్లేశం, అడిషనల్ ఎన్‌బీసీ సభ్యుడు రామనాథ్ గణేశ్, ఎన్టీపీసీ మజ్దూర్ సంఘ్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, సాగర్ రాజు, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2025 | 11:45 PM