ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉత్సవాలకు ముస్తాబైన మల్లన్నక్షేత్రం

ABN, Publish Date - Jul 13 , 2025 | 12:01 AM

ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఈ నెల 13, 15 తేదీల్లో పెద్దపట్నం, అగ్నిగుండ మహోత్సవాలకు ముస్తాబైంది. ఆలయంలో ఈ నెల 13న ఆదివారం రాత్రి పెద్దపట్నం మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఈవో సదయ్య తెలిపారు.

ఓదెల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఈ నెల 13, 15 తేదీల్లో పెద్దపట్నం, అగ్నిగుండ మహోత్సవాలకు ముస్తాబైంది. ఆలయంలో ఈ నెల 13న ఆదివారం రాత్రి పెద్దపట్నం మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఈవో సదయ్య తెలిపారు. అలాగే రాత్రి 7 గంటలకు భద్రకాళి ఆవాహన, 10 గంటల నుంచి అగ్నిగుండం మహోత్సవం, పెద్దపట్నం జరగనున్నదని తెలిపారు. 14న ఉదయం 5 గంటలకు అగ్నిగుండం దాటుట అనంతరం దక్షయాగ కథా శ్రవణం, గెలుపు ఉత్సవం, స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద, వితరణ జరపనున్నామని తెలిపారు.

ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఆలయం వరకు హుజూరాబాద్‌, కరీంనగర్‌ డిపోల నుంచి బస్సులు నడువనున్నాయి. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సరిపడే విధంగా సౌకర్యాల ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వేడుకల ప్రాంగణాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయం వద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసి పోత్కపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ ఎస్‌ఐల ఆధ్వర్యంలో భద్రత బలగాలతో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.

Updated Date - Jul 13 , 2025 | 12:01 AM