బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి
ABN, Publish Date - Apr 08 , 2025 | 12:15 AM
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. సోమ వారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు.
గోదావరిఖని, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. సోమ వారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. నీరు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యా యాలకు వ్యతిరేకంగా 25 ఏళ్ల క్రితం తెలం గాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిం దన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో స్వరాష్ట్రం కోసం అలు పెరుగని పోరాటాలు చేసిందన్నారు. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మెతో కేంద్రాన్ని కదిలించిం దన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలం గాణ పునర్ నిర్మాణంలో భాగంగా టీఆర్ ఎస్, బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవిం చిందన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో అనేక విప్లవాత్మ కమైన మార్పులు తీసుకువచ్చిందని, రైతు లకు, బడుగు, బలహీనవర్గాలకు, దళి తులకు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసీఆర్‌దన్నారు. ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు భవిష్యత్ గుర్తించి దిశా నిర్దేశం చేయనున్నారని, ప్రజలు హాజరై విజయవంతం చేయాల న్నారు. నాయకులు మెతుకు దేవరాజ్, కుమ్మరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Apr 08 , 2025 | 12:15 AM