ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కార్మికుల ఉద్యమాలను బలోపేతం చేద్దాం

ABN, Publish Date - Jun 09 , 2025 | 12:03 AM

కార్మిక హక్కులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడలను తిప్పికొట్టాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో టీయూసీఐ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో 43కోట్ల మంది కార్మికులను మోదీ ప్రభుత్వం బానిసలుగా చేసేందుకు కుట్రలు చేస్తుందని, దీనిని కార్మికవర్గం తిప్పికొట్టాలన్నారు.

గోదావరిఖని, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): కార్మిక హక్కులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడలను తిప్పికొట్టాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో టీయూసీఐ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో 43కోట్ల మంది కార్మికులను మోదీ ప్రభుత్వం బానిసలుగా చేసేందుకు కుట్రలు చేస్తుందని, దీనిని కార్మికవర్గం తిప్పికొట్టాలన్నారు. ఎందరో త్యాగ ఫలితంగా సాధించుకున్న 42హక్కులను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మికుల పని గంటలను పెంచడానికి ప్రయత్నం చేస్తుందని, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజా పరిపాలన అంటూ ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జీఓ నెం.73ను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పోచమ్మ గుడి నుంచి గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. టీయూసీఐ నాయకులు తోకల రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నంది రామయ్య, జూపాక శ్రీనివాస్‌, సత్యనారాయణరెడ్డి, దేవరాజ్‌, వెంకన్న, రమేష్‌, చంద్రయ్య, లక్ష్మి, పులిపాక రాజేందర్‌, పోషం, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:03 AM