పూడికతీత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి
ABN, Publish Date - May 23 , 2025 | 12:30 AM
ఓదెల మండలం మీదుగా కాల్వశ్రీరాంపూర్ చివరి ఆయకట్టుకు నీరు చేరుకునేలా కాలువల్లో పూడికతీత పనులు పకడ్బందీగా నిర్వహిం చాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం మండలంలోని డి-86 ఎస్సారెస్పి కాలువలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లోని కాలువలను, ఉప కాలువలను 20 రోజుల్లో శుభ్రం చేయాలన్నారు.
ఓదెల, మే 22 (ఆంధ్రజ్యోతి) : ఓదెల మండలం మీదుగా కాల్వశ్రీరాంపూర్ చివరి ఆయకట్టుకు నీరు చేరుకునేలా కాలువల్లో పూడికతీత పనులు పకడ్బందీగా నిర్వహిం చాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం మండలంలోని డి-86 ఎస్సారెస్పి కాలువలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లోని కాలువలను, ఉప కాలువలను 20 రోజుల్లో శుభ్రం చేయాలన్నారు. మండలంలో దాదాపు 40 కిలో మీటర్ల మేర ఎస్సారెస్పి, నీటి పారుదల కాలువల్లో పూడికతీత, చెత్త తొలగింపు, జంగల్ కటింగ్ వంటి పనులను ఉపాధిహామీ కూలీలతో చేపట్టాలన్నారు. కాలువల్లో అవసరమైన చోట మరమ్మతు పనులు నాణ్యతతో చేయాలన్నారు. వర్షకాలంలోపు గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలను అధిక సంఖ్యలో నియమించి ఈ పనులు చేపట్టా లని అధికారులకు సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, ఎంపీడీ వోలు దివ్యదర్శనరావు, తిరుపతి, ఎంపీవో షబ్బిర్ పాష, ఏపీవో రమేష్ పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): కాలువ చివరి భూములకు సాగునీరు అందేలా పనులు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సుద్దాల గ్రామం పరిధిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ డీ 86 ప్రధాన కాలువ లో ఉపాధిహామీ పను లను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతు కాలువ చివరి ఆయకట్టుకు పంటలకు నీటి ప్రవాహం చేరుకునేలా పూడిక తీత పనులు చేపట్టాలని అన్నారు. మెయిన్ కాలువలతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాలువలను కూడా పూర్తి స్థాయిలో శుభ్రం చేయించాలన్నారు.
Updated Date - May 23 , 2025 | 12:30 AM