ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN, Publish Date - Aug 02 , 2025 | 12:24 AM

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరచేరని మండల ప్రత్యేకాధికారి ఆరీఫ్‌ అన్నారు. స్వచ్ఛ శుక్రవారం డ్రై డేలో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి తడి చెత్త, పొడి చెత్త, నిలువ చేసే విధానం, సీజ నల్‌ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తెలిపారు.

కాల్వశ్రీరాంపూర్‌, ఆగస్టు1(ఆంధ్రజ్యోతి): పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరచేరని మండల ప్రత్యేకాధికారి ఆరీఫ్‌ అన్నారు. శుక్రవారం తారుపల్లి, మీర్జంపేట గ్రామాల్లో పర్యటించారు. స్వచ్ఛ శుక్రవారం డ్రై డే కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి తడి చెత్త, పొడి చెత్త, నిలువ చేసే విధానం, సీజ నల్‌ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తెలిపారు. నర్సరీలు, వైకుంఠధామాలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, రోడ్డు, సెగిగ్రేషన్‌ షెడ్‌, అంగన్‌వాడీ కేంద్రాలు, మంచినీటి చేతిపంపులను పరిశీలించారు. గ్రామపంచాయతీ సిబ్బంది, కార్యదర్శు లకు సూచనలు చేశారు. అంగన్‌వాడీ టీచర్లు రాజమణి, శ్రావణి, ఆశా కార్యకర్త రాధా, వీవోఏలు కవిత, రజిత, కార్యదర్శి ముత్యాల సందీప్‌, పాల్గొన్నారు.

ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆయా గ్రామాల్లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు వురు అధికారులు ఇంటింటికి తిరుగుతూ నిల్వ నీటిని పారబోసి, పరిశుభ్రత, పారిశుధ్య చర్యలపై అవగాహన కల్పించారు. సుల్తాన్‌పూర్‌లో ఎంపీడీఓ భాస్కర్‌ రావు, లోకపేటలో ఎంపీఓ కిరణ్‌లు సందర్శించి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని పరిశుభ్రతను పాటించి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వివరించారు. ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు.

మంథనిరూరల్‌, (ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందిని డీఎల్‌పీవో ఆదేశించారు. అడవిసోమన్‌పల్లిలో హెల్త్‌ సబ్‌సెంటర్‌ను సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో పర్యటించి పారిశుధ్య పను లను నిరంతరం కొనసాగించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎంపీవో శేషయ్యసూరి, కార్యదర్శి ఉన్నారు.

పెద్దపల్లి రూరల్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో వానాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు. స్వచ్ఛ శుక్రవారంలో భాగంగా కనగర్తిలో కార్యదర్శి సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సీఏ లక్ష్మీ, అంగన్‌వాడి టీచర్‌ సుమలత సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:24 AM