ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణకు కేసీఆర్‌ పాలనే శ్రీరామరక్ష

ABN, Publish Date - Jul 14 , 2025 | 12:07 AM

మం డలం పరిధిలోని ఓ ప్రయివేటు ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌, రాష్ట్ర నాయకుడు కౌశిక్‌ హరి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కేసీ ఆర్‌ పాలనే శ్రీరామరక్ష అన్నారు.

పాలకుర్తి, జూలై 13(ఆంధ్రజ్యోతి): మం డలం పరిధిలోని ఓ ప్రయివేటు ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌, రాష్ట్ర నాయకుడు కౌశిక్‌ హరి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కేసీ ఆర్‌ పాలనే శ్రీరామరక్ష అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. గ్రామాల్లో ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభు త్వం అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు వృద్ధాప్య పెన్షన్‌ రూ.4 వేలు అమలు చేయలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున రైతు భరోసా పథకాన్ని అమలు చేశారని తెలిపారు. రైతుబంధు పథకాన్ని కేసీఆర్‌ నాట్లు వేసే సమయంలో ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓట్ల సమయంలో ఇస్తుందన్నారు. కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్‌ చేసి ఇప్పటి వరకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో గ్రామ బాట కార్యక్రమం చేపట్టి గ్రామ ప్రజలకు కాంగ్రెస్‌ వైఫల్యాలను వివరి స్తామని తెలి పారు. గ్రామబాట కార్యక్ర మాన్ని సోమ వారం ఈసాలతక్క ళ్లపల్లి నుంచి ప్రారంభిస్తామని, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొ నాలన్నారు. మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ ఎస్‌ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:07 AM