ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖనిలో కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం

ABN, Publish Date - Mar 24 , 2025 | 12:08 AM

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌పై అనుచిత వ్యాఖ్య లు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆదివారం ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు దాసరి విజయ్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌, మహంకాళి స్వామి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు గోదావరి గోస పేరుతో పాదయాత్ర చేశారని, గోదావరి ఎండిపోవడానికి కారకులు బీఆర్‌ఎస్‌ నాయకులన్నారు.

కళ్యాణ్‌నగర్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌పై అనుచిత వ్యాఖ్య లు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆదివారం ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు దాసరి విజయ్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌, మహంకాళి స్వామి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు గోదావరి గోస పేరుతో పాదయాత్ర చేశారని, గోదావరి ఎండిపోవడానికి కారకులు బీఆర్‌ఎస్‌ నాయకులన్నారు. గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కృంగి పోయాయని, బీఆర్‌ఎస్‌ నాయకుల అవినీతి వల్లనే లక్షల కోట్ల ప్రజాధనాన్ని ప్రాజెక్టుల పేరుతో దోచుకు తిన్నారన్నారు.

గోదావరిలో నీరు నిల్వ చేస్తే సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతా యన్నారు. రామగుండాన్ని రూ.500కోట్లతో సుందరంగా తీర్చిదిద్దమే లక్ష్యంగా మక్కాన్‌సింగ్‌ పెట్టుకున్నారని, ఎమ్మెల్యేపై అవాకులు చెవాకులు చేస్తే సహించబోమని, గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా మారడం లేదన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కాల్వ లింగస్వామి, పెద్దెల్లి తేజస్వినిప్రకాష్‌, కొలిపాక సుజాత, తిప్పారపు శ్రీనివాస్‌, ఎండీ ముస్తాఫా, బాల రాజ్‌కుమార్‌, గుండేటి రాజేష్‌, మారెల్లి రాజిరెడ్డి, కౌటం సతీష్‌, చుక్కల శ్రీనివాస్‌, కొప్పుల శంకర్‌, అనుమ సత్యనారాయణ, అల్లి శంకర్‌, ఉదయ్‌ రాజ్‌, మీసాల సతీష్‌, మాలెం మధు, కొమ్ము వేణు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 12:08 AM