నేడు ఓదెలలో జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం
ABN, Publish Date - Jul 12 , 2025 | 11:57 PM
ఓదెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి, జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్టు క్లాస్ కోర్టును ఆదివారం ఉదయం హైకోర్టు జడ్జిలు ప్రారంభించనున్నారు. కోర్టు కేసులను వేగంగా పరిష్కరించేందుకు వీలుగా మండలాల్లో సైతం ప్రభుత్వం కోర్టులను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా ఓదెలకు కోర్టు మంజూరయ్యింది.
ఓదెల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఓదెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి, జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్టు క్లాస్ కోర్టును ఆదివారం ఉదయం హైకోర్టు జడ్జిలు ప్రారంభించనున్నారు. కోర్టు కేసులను వేగంగా పరిష్కరించేందుకు వీలుగా మండలాల్లో సైతం ప్రభుత్వం కోర్టులను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా ఓదెలకు కోర్టు మంజూరయ్యింది. ఇటీవల కోర్టును ఆరంభించేందుకు జడ్జీ, ఇతర క్యాడర్ పోస్టులను కేటాయించింది. దీంతో కోర్టుకు అనువుగా ఓదెల మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకుని కోర్టు నిర్వహణకు అనుగుణంగా ముస్తాబు చేశారు. ఓదెల, కాలశ్రీరాంపూర్ మండలాలకు చెందిన కేసులను పరిష్కరించనున్నారు. \
ఇప్పటి వరకు ఈ మండలాలకు చెందిన కేసులు సుల్తానాబాద్ కోర్టు పరిఽధిలో ఉన్నాయి. ఆ కేసులను ఓదెల కోర్టుకు బదిలీ చేయనున్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులతో రెగ్యులర్‌గా వచ్చే కేసులను పరిష్కరించనున్నారు. కోర్టును హైకోర్టు జడ్జీలు కె లక్ష్మణ్, ఎన్‌వీ శ్రావణ్ కుమార్, ఈవీ వేణుగోపాల్, పుల్ల కార్తీక్, జే శ్రీనివాస్ రావు ఆరంభించనున్నారు. జిల్లా సెషన్ జడ్జి కుంచాల సునీత హాజరు కానున్నారు. శనివారం జిల్లా జడ్జి కుంచాల సునీత ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత కోర్టు భవనాన్ని సందర్శించి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. డీసీపీ కరుణాకర్, ఏసీపీ గజ్జి కృష్ణలు సైతం సందర్శించి పోలీస్ బందోబస్తు కోసం సీఐ, ఎస్‌ఐలకు సూచనలు జారీ చేశారు.
Updated Date - Jul 12 , 2025 | 11:57 PM