ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అధికారులను బెదిరించడం సరైంది కాదు

ABN, Publish Date - May 02 , 2025 | 11:32 PM

రామగుండంలో పాలన గాడి తప్పిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ విమర్శించారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నేతలే అధికారులను బెది రించడం సరైంది కాదని, రామగుండంలో మెడికల్‌ కళాశాల తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దన్నారు.

గోదావరిఖని, మే 2(ఆంధ్రజ్యోతి): రామగుండంలో పాలన గాడి తప్పిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ విమర్శించారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నేతలే అధికారులను బెది రించడం సరైంది కాదని, రామగుండంలో మెడికల్‌ కళాశాల తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దన్నారు. ఇటీవల అంతర్గాం మండల తహసీల్దార్‌పై ఓ కాంగ్రెస్‌ నాయకుడు ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు పెట్టి బదిలీ చేయించాడని, ఇటీవల గోదావరిఖనిలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి తనిఖీకి వచ్చిన డీఎంహెచ్‌వోను కాంగ్రెస్‌ నాయకుడు బెదిరించడం సరైంది కాదన్నారు.

పారిశ్రా మిక ప్రాంతంలో వైద్యులకు తాము అండగా నిలిచా మని, గతంలో ఇక్కడ పని చేసిన ఓ పిల్లల వైద్యుడిపై దాడి చేయించి ఇక్కడి నుంచి వెళ్లగొట్టిన చరిత్ర కాంగ్రెస్‌దని, మక్కాన్‌సింగ్‌ ఎమ్మెల్యే అయిన తరువాత వైద్యులకు అండగా ఉంటానని మాట్లాడడం విడ్డూరం గా ఉందన్నారు. ఎమ్మెల్యే పాలనపై దృష్టి పెట్టాలని, అధికారులను బెదిరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అభిషేక్‌రావు, కృష్ణవేణి, విజయ, మురళీ ధర్‌రావు, సంధ్యారెడ్డి, పిల్లి రమేష్‌, వాసు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 11:32 PM