ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు భరోసా అందేనా!

ABN, Publish Date - Jun 09 , 2025 | 11:58 PM

వానాకాలం సీజన్‌ ఆరంభమై వారం రోజులవు తున్నది. రైతులు సాగు పనుల్లో నిమగ్నం కాగా, ఈసారైనా ప్రభుత్వం అందరికీ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తుందా లేదా అని రైతుల్లో అయోమయం నెలకొన్నది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

వానాకాలం సీజన్‌ ఆరంభమై వారం రోజులవు తున్నది. రైతులు సాగు పనుల్లో నిమగ్నం కాగా, ఈసారైనా ప్రభుత్వం అందరికీ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తుందా లేదా అని రైతుల్లో అయోమయం నెలకొన్నది. యాసంగి సీజన్‌లో రైతు భరోసా పథకాన్ని ఆరంభించిన ప్రభుత్వం కేవలం 3 ఎకరాల భూములు కలిగిన రైతులకే ఎకరానికి 6 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత మిగతా రైతులంతా తమకు డబ్బులు ఎప్పుడు ఖాతాలో పడతాయా అని ఎదురు చూశారు. కాంరగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకాన్ని అమలు చేశారు. ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూములుగా పట్టాలు కలిగిన రైతులందరికీ ప్రతీ సీజన్‌లో ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే రైతు కూలీలకు కూడా భరోసాను అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. గడిచిన వానాకాలం సీజన్‌ నుంచే రైతు భరోసా అమలు చేస్తుందని అంతా ఎదురుచూశారు. ఆ సీజ న్‌లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ పథ కాన్ని అమలు చేసింది. జిల్లాలో 450 కోట్ల రూపాయల వరకు సంబంధిత రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేసింది. కానీ ఆ సీజన్‌లో రైతు భరోసా ఆరంభించ లేదు. ఈ యాసంగి సీజన్‌ నుంచి సాగుకు యోగ్యమైన భూములు కలిగిన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి ప్రకటించారు. అది కూడా ఎకరానికి ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా 7,500 రూపాయలు గాకుండా 6 వేల రూపాయలు ఇస్తామని ప్రకటిం చారు. ఈ మేరకు సాగులో ఉన్న భూములను గుర్తిం చేందుకు రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు సర్వే చేశారు.

జిల్లాలో ధరణి పోర్టల్‌ ప్రకారం పట్టా కలిగిన భూములు 2,78,555 ఎకరాల భూములు ఉండగా, ఇందులో పంటలు సాగు చేయని బంచరాయి భూము లు, రియల్‌ ఎస్టేట్‌ భూములు, నాలా కన్వర్షన్‌ చేయ కుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములు 2655.32 ఎకరాల భూములు సాగులో లేవని గుర్తించారు. 2,75,899 ఎకరాల భూములు సాగులో ఉన్నట్లు తేల్చారు. మొత్తం 1,61,032 మంది రైతులకు రైతు భరోసా కింద 165 కోట్ల 53 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని ఆరంభించి 3 ఎకరాలు గల 1,14,313 మంది రైతులకు 82 కోట్ల 57 లక్షల 68 వేల 13 రూపాయలు జమ చేసింది. 3 ఎకరాలకు పైగా భూములు కలిగిన దాదాపు 45 వేలకు పైగా రైతులకు జమ చేయాల్సిన 51 కోట్ల రూపాయలు జమ చేయలేదు. ఇటీవల జరిగిన కేబి నెట్‌ సమావేశంలో రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా కింద డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారా, లేదా అని రైతులు చర్చించుకుంటున్నారు. యాసంగి సీజన్‌లో సన్న ధాన్యానికి సంబంధించిన బోనస్‌ డబ్బు లను ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. గడిచిన సీజన్‌కు సంబంధించి 3 ఎకరాలకు పైబడిన రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్ముతో పాటు ఈ సీజన్‌కు ఇవ్వాల్సిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Jun 09 , 2025 | 11:58 PM