ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
ABN, Publish Date - May 07 , 2025 | 11:40 PM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, పైలెట్ గ్రామాలు మినహా ఇతర గ్రామాలు, పట్టణాల్లో ఈనెల 10వ తేదీ వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.
పెద్దపల్లి, మే 7 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, పైలెట్ గ్రామాలు మినహా ఇతర గ్రామాలు, పట్టణాల్లో ఈనెల 10వ తేదీ వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్మాణం పూర్త యిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేం దుకు అవసరమైన మౌలిక వసతులకు ప్రతిపాదనలు అందిం చాలన్నారు. పెద్దపల్లి పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతుల పనులు పూర్తయ్యాయని, ఈ నెలాఖరు వరకు లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపారు. రామగుండం లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తాగునీరు, విద్యుత్ సరఫరా, డైన్రేజీ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశిం చారు. కాల్వశ్రీరాంపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తాగు నీరు, సెప్టిక్ ట్యాంక్, రోడ్డు పనులు చేపట్టాలని అన్నారు. ప్రతీ మండలంలో ఎంపిక చేసిన పైలట్ గ్రామాలలో 1940 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తే బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మించుకున్న 170 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మొదటి విడత లక్ష రూపాయల ఆర్థిక సహాయం విడుదల చేసిందన్నారు. పైలట్ గ్రామాలలో మంజూరు చేసిన ఇళ్లలో కనీసం 50 శాతం వరకు ఇండ్లు గ్రౌండింగ్ చేసేలా కార్యా చరణ అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన దాదాపు 1200 మంది లబ్ధిదారులు ఇంటి నిర్మా ణం ప్రారంభించ లేదని, వీరితో చర్చించి త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని, డబ్బు సమస్య ఉంటే డ్వాక్రా ద్వారా రుణాలు అందించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలని, ఎటువంటి ఒత్తిడులకు తావు ఇవ్వడానికి వీలు లేదని, ప్రభుత్వ నిబం ధనల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఎంపిక జరగాలని అన్నారు. జూన్ 2 వరకు లబ్దిదారుల ఎంపిక, శిక్షణ పూర్తి చేసుకోవాలని, జూన్ 2న యువ వికాసం యూనిట్ మంజూరు పత్రాలు పంపిణీ చేసి తర్వాత వాటి గ్రౌండింగ్ పై దృష్టి సారించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, హౌసింగ్ ఈఈ రాజేశ్వర్ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం కాళిందిని పెద్దపల్లి, మంథని మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, మనోహర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 07 , 2025 | 11:40 PM