ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు ఇసుక అక్రమ రవాణా

ABN, Publish Date - Aug 04 , 2025 | 11:51 PM

రామగుండంలో స్థానిక అవసరాలకు గోదావరి నుంచి ఇసుక తీసుకు నేలా కలిగిన వెసలుబాటును ఇసుక అక్రమార్కులకు వరంగా మారింది. ట్రాక్టర్ల యజమానులుగా ఉన్న కొం దరు చోటా నాయకులు ఇసుక మాఫియాకు తెరలే పారు. పగటి పూట గోదావరి నది నుంచి ఇసుక తర లించి డంప్‌ చేసుకుంటున్నారు. రాత్రి 9గంటల నుంచి ఎక్స్‌కావేటర్లతో లారీల్లో లోడ్‌ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

కోల్‌సిటీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రామగుండంలో స్థానిక అవసరాలకు గోదావరి నుంచి ఇసుక తీసుకు నేలా కలిగిన వెసలుబాటును ఇసుక అక్రమార్కులకు వరంగా మారింది. ట్రాక్టర్ల యజమానులుగా ఉన్న కొం దరు చోటా నాయకులు ఇసుక మాఫియాకు తెరలే పారు. పగటి పూట గోదావరి నది నుంచి ఇసుక తర లించి డంప్‌ చేసుకుంటున్నారు. రాత్రి 9గంటల నుంచి ఎక్స్‌కావేటర్లతో లారీల్లో లోడ్‌ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఎస్కార్ట్‌తో జిల్లా సరిహద్దులు దాటిస్తు న్నారు. రోజుకు పదుల సంఖ్యలో లారీల్లో ఇసుకను తరలించి లక్షలు దండుకుంటున్నారు.

రామగుండం నియోజకవర్గంలో స్థానిక అవసరా లకు గోదావరి నుంచి ట్రాక్టర్లలో ఇసుక తీసుకునేలా వెసలుబాటు కల్పించారు. స్థానిక శాసన సభ్యుడిని ట్రాక్టర్ల యజమానులు ఈ మేరకు విజ్ఞప్తి చేయడంతో వారి ఉపాధిని దృష్టిలో ఉంచుకుని అవకాశం కల్పిం చారు. దీంతో ఇసుక రేట్లు కూడా రామగుండంలో దిగివ చ్చాయి. ట్రాక్టర్‌ లోడు కేవలం రూ.1200లకే లభిస్తోంది. కానీ కొందరు ట్రాక్టర్ల యజమానులు దీన్ని ఆసరాగా చేసుకుని భారీ డంప్‌లు పోగేశారు. స్థానిక సంజయ్‌గాంధీనగర్‌లోని ఒక బ్రిక్స్‌ ప్లాంట్‌లో కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రికి లారీల్లో లోడ్‌ చేస్తూ ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రోజూ పరిస్థితులను బట్టి 5నుంచి 10లారీల వరకు ఇసుక లోడ్‌ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ లారీలకు స్థానిక నాయకుడి అనుచరులు ఎస్కార్ట్‌లుగా ఉంటున్నారు. కొన్ని రోజులుగా ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తున్నది. హైదరాబాద్‌లో ఒక లారీ లోడ్‌ ఇసుకను రూ.50వేల నుంచి రూ.60వేలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తున్నది. సోమవారం రాత్రి ఈ విషయం బయటకు పొక్కడంతో ట్రాక్టర్ల యజమానుల్లో కలకలం రేగింది. కొన్ని రోజులుగా ఈ అక్రమదందా సాగుతున్నా ప్రభుత్వశాఖల స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Aug 04 , 2025 | 11:51 PM