ఆపరేషన్ కగార్ నిలిపివేయకుంటే ఢిల్లీని ముట్టడిస్తాం
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:18 AM
ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయకుంటే ఢిల్లీని ముట్టడిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం కేంద్ర ప్రభు త్వాన్ని హెచ్చరించారు. మంగళవారం భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గోదావరిఖని, జూన్ 24(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయకుంటే ఢిల్లీని ముట్టడిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం కేంద్ర ప్రభు త్వాన్ని హెచ్చరించారు. మంగళవారం భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ కర్రె గుట్టల్లో ఆదివాసీలను, మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం హత్య చేస్తుందని, 2026లోపు దేశంలో మావోయిస్టులు లేకుండా ఆపరేషన్ కగార్ పేరుతో మారణ హోమం సృష్టిస్తుందని ఆరోపించారు.
ఆదివాసి గిరిజనులను అడవుల్లో నుంచి వెళ్లగొట్టి ఖనిజ సంపదను అదాని, అంబానీలకు దోచి పెడుతుందన్నారు. మావోయిస్టులను బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. ఈ నెల 28న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీపీఐ 4వ మహా సభను విజయవంతం చేయాలన్నారు. ఎల్లయ్య, కే కనకరాజు, గోషిక మోహన్, కవ్వంపల్లి స్వామి, తాళ్లపల్లి మల్లయ్య, సూర్య, తొడుపునూరి నరేష్, ఓదమ్మ, కనకరాజు, గౌస్, చంద్రశేఖర్, అబ్దుల్ కరీం, జగన్ పాల్గొన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 12:18 AM