కుల సంఘాలకు అండగా ఉంటా
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:59 PM
కుల సంఘాలకు అండగా ఉంటానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హామీ ఇచ్చారు. సోమ వారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీతో పాటు మేడారంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు.
ధర్మారం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): కుల సంఘాలకు అండగా ఉంటానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హామీ ఇచ్చారు. సోమ వారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీతో పాటు మేడారంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో బొమ్మరెడ్డిపల్లి, చామనపల్లిలో 150కి పైగా గొర్రెలు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమని మంత్రి అన్నారు. యాదవ కుటుంబాలకు 8 లక్షల 70 వేల ఆర్థిక సహాయం త్వరగా అందించామని తెలిపారు. యాదవ, కుర్మ, గౌడ, మూన్నూరు కాపుల కు కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తానని, వీలైనంత త్వరగా స్థల పరి శీలన చేసుకోవాలని సూచించారు. ఎర్రగుంటపల్లిలో ఐటీఐ కళాశాల నిర్మిస్తా మని తెలిపారు. కలెక్టర్ మట్లాడుతూ 15 రోజల క్రితం గొర్రెలు చనిపోగా మంత్రితో కలిసి నష్టపరిహారం విషయంలో యాదవ కుటుంబాలకు ప్రభు త్వం తరుపున ఆదుకుంటామని హామీ ఇచ్చామని తెలిపారు. బొమ్మరెడ్డిపల్లిలో 5గురు లబ్ధిదారులకు 5లక్షల10 వేలు, చామనపల్లిలో 9 మందికి 3 లక్షల 64 వేల చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. చామనపల్లిలో ఓ పేద కుటుంబం ఇల్లు కాలిపోయిన ఘటన మంత్రి దృషికి రాగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, మండల వ్యాప్తంగా 6 వందల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
బీఆర్‌ఎస్ అవినీతిపై కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్ళ అవినీతి పాలన చేసిన బీఆర్ ఎస్ పార్టీపై ఎందుకు విచారణ జరిపించలేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రశ్నించారు. పదేండ్ల పాలనలో బీఆర్‌ఎస్ పార్టీ వేల కోట్ల అవినీతికి పాల్పడినా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారినా కేంద్ర మంత్రి అమిత్‌షా ఎందుకు విచారణకు ఆదేశిం చలేదో సమాధానం చెప్పాలన్నారు. ఈడీలు, సీబీఐలు మీ చేతుల్లో ఉన్నా బీఆర్‌ఎస్ పార్టీ అవినీతిపై ఎప్పుడు బీజేపీ ప్రశ్నించలేదన్నారు. చట్టసభల్లో బీజేపీకి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు చెబుతుందని, బీఆర్‌ఎస్ బీజేపీకి డీఎన్‌ఏ పార్టీ అయినందునే పదేండ్లు అవినీతికి పాల్పడిన బీజేపీ పెద్దలు చూసీచూడ నట్లు వ్యవహరించారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ నేతృతంలో పేదల కోసం ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పెద్దలకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలని మాట్లాడిన మాటలే తప్ప ఆయన మాటల్లో చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్రానికి దమ్ముంటే అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులపై ఇప్పటికైనా విచా రణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
మేడారంలో పలు అభివృద్ధి పనులను కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. గ్రామంలో 261 విద్యుత్ పోల్స్ తరలింపునకు రూ.26 లక్షలు, లూజ్ వైర్ మర మ్మతులకు రూ.14 లక్షలు, అంతర్గత సీసీ రోడ్ల కోసం 8 లక్షల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలి పారు. మేడారం కోర్టు నుంచి కటికెనపల్లి వర కు సీసీ రోడ్డు పనులు నెల రోజుల్లో ప్రారం భిస్తామన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్య క్రమం కింద బస్సులు కొనుగోలు చేసి ఆర్టీ సీకి అద్దెకిచ్చి మహిళలు ఆదాయం సమకూ ర్చడం హర్షనీయమన్నారు. అనంతరం 42 స్వశక్తి సంఘాల మహిళలకు బ్యాంక్ లింకేజి ద్వారా ఐదు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఆర్‌డీఓ బి.గంగయ్య, పీడీ హౌసింగ్ రాజేశ్వర్‌రావు, ఏఎంసీ చైర్మెన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మెన్ అరిగె లింగయ్య, మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, డీటి ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు మండల దివ్యాంగులు వినతిపత్రం అందజేశారు. ఇం దిరమ్మ ఇండ్లు మంజూరుతోపాటు ట్రై సైకి ళ్లు, మోబైల్ ఆటోలు, 5జీ ఫోన్స్ మంజూరు చేయాలని కోరారు. సెకండ్ ఏఎన్‌ఎంలు వినతి పత్రం అందజేశారు.
Updated Date - Jun 30 , 2025 | 11:59 PM