ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వీధి వ్యాపారులకు చేయూత

ABN, Publish Date - Jul 06 , 2025 | 12:58 AM

వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జిల్లా పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో కామన్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్‌ (సీఐజీ)లను ఏర్పాటు చేయాలని మెప్మాకు ఆదేశాలు జారీ చేసింది.

జగిత్యాల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జిల్లా పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో కామన్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్‌ (సీఐజీ)లను ఏర్పాటు చేయాలని మెప్మాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 75 సంఘాలు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రతి గ్రూపులో ఐదు నుంచి పది మంది సభ్యులు ఉండేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో 16,981 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. వీరితో ఏర్పాటు చేసే గ్రూపుల్లో ఎంపిక చేసిన సంఘాల్లోని సభ్యులకు ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. వారు బ్యాంకు ఖాతాలు తెరిచిన వెంటనే సంఘాల పొదుపు ప్రక్రియను పరిశీలించి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించనున్నారు. ఆరు నెలల తర్వాత సంఘాలకు మొదటి విడతగా రూ.లక్ష, తర్వాత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణం పొందేలా ప్రణాళిక రూపొందించారు. వీధి వ్యాపారులు ప్రత్యేకంగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా పీఎం స్వనిధి పథకం కింద దుకాణాలు నిర్మించనున్నారు.

ఫవీధి వ్యాపారులకు రేకుల షెడ్లు

జిల్లా కేంద్రమైన జగిత్యాలలో గొల్లపల్లి రోడ్డు వైపు 37 రేకుల షెడ్లు, కోరుట్ల మున్సిపాలిటీలో కల్లూరు రోడ్డులో 12 రేకుల షెడ్లు, ఐబీ రోడ్డులో 20 షెడ్లు, మెట్‌పల్లి బస్‌డిపో సమీపంలో 25 రేకుల షెడ్లు నిర్మించారు. వీటిని పలువురు వీధి వ్యాపారులకు కేటాయించారు. మిగితా రెండు మున్సిపాలిటీల్లోనూ వీటిని నిర్మించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫసభ్యులకు బీమా సదుపాయం..

పొదుపు సంఘంలో సభ్యులుగా చేరిన వ్యాపారులకు రూ.2 లక్షల బీమా సదుపాయం కల్పించనున్నారు. ప్రమాదవశాత్తు సభ్యులు మృతిచెందితే వారికి బీమా వర్తిస్తుంది. ఈ మేరకు వీధి వ్యాపారులకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో గుర్తింపుకార్డులు అందజేశారు. దుకాణాలు కేటాయించిన వారితో పట్టణ వ్యాపారుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ చైర్మన్‌గా మున్సిపల్‌ కమిషనర్‌ వ్యవహరించనున్నారు.

రుణం ఇప్పిస్తాం

-దుర్గపు శ్రీనివాస్‌గౌడ్‌, మెప్మా జిల్లా అధికారి

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో ఏర్పాటు అయ్యే సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించడానికి కృషి చేస్తున్నాం. దీంతో వారికి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది.

మున్సిపాలిటీ....వీధి వ్యాపారులు...ఏర్పాటు చేసే సంఘాలు

ధర్మపురి.....................982 - 11

మెట్‌పల్లి...................3,713 - 38

రాయికల్‌...................934 - 10

కోరుట్ల......................4,188 - 44

జగిత్యాల...................6,825 -70

----------------------------------

మొత్తం................... 16,632 -173

Updated Date - Jul 06 , 2025 | 12:58 AM