కార్మికులపై వేధింపులు ఆపాలి
ABN, Publish Date - May 13 , 2025 | 11:38 PM
రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మి కులు, సిబ్బందిపై అధికారుల వేధింపులు ఆపాలని, లేకపోతే నిరవధిక సమ్మె తప్పదని కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ పేర్కొన్నది. మంగళవారం కార్యాలయ ప్రాంగణంలో యూనియన్ ప్రతినిధులు కార్మికులతో సమావేశం నిర్వహించారు.
కోల్‌సిటీ, మే 13(ఆంధ్రజ్యోతి): రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మి కులు, సిబ్బందిపై అధికారుల వేధింపులు ఆపాలని, లేకపోతే నిరవధిక సమ్మె తప్పదని కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ పేర్కొన్నది. మంగళవారం కార్యాలయ ప్రాంగణంలో యూనియన్ ప్రతినిధులు కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్, అదనపు కలెక్టర్ అరుణశ్రీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్మికుల సమస్యలపై చర్చించారు. తొలగించిన రాజబాబు, వెంకటస్వామి సూపర్‌వైజర్లను విధుల్లోకి తీసుకో వాలని, రాజీవ్ రహదారిపై మున్సిపల్ కార్మికులతో పని చేయించవద్దని కోరా రు. వంద మంది కార్మికులకు బయో మెట్రిక్ సరిగా లేదనే సాకుతో రూ.4 లక్షల వేతనాలు కోత పెట్టారన్నారు. సొసైటీ నామినేటెడ్ అధ్యక్షుడిని తొల గించి ఎన్నికలు నిర్వహించాలని, కార్మి కులను వేధిస్తున్న శానిటరీ ఇన్ స్పెక్టర్‌ను ఇతర శాఖకు బదిలీ చేయా లని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన కార్మికులకు డబ్బులు చెల్లిం చాలని, వయసు పైబడి అనారోగ్యంతో బాధపడు తున్న కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలను ఇవ్వా లని, అధికారుల ఇండ్లలో పారిశుధ్య కార్మికులను పని చేయించవద్దని కోరారు. కార్మిక సంఘాల ప్రతి నిధులకు, కమిషనర్, డిప్యూటీ కమిషనర్లకు వాడీవేడి చర్చ జరిగింది. త్వరలోనే రామగుండం ఎమ్మెల్యే, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళతామని వారు పేర్కొన్నారు.
Updated Date - May 13 , 2025 | 11:38 PM