ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్‌జీ-1లో ఘనంగా వన మహోత్సవం

ABN, Publish Date - Jul 17 , 2025 | 11:41 PM

వనమహోత్సవంలో భాగంగా సింగరేణి ఆర్‌జీ-1 ఏరియా ఆధ్వర్యంలో గురువారం జీడీకే ఓసీపీ-5 ఓబీ డంప్‌పైన వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మక్కాన్‌ి సంగ్‌ రాజ్‌ ఠాకూర్‌, ఆర్‌జీ-1 జీఎం డీ లలిత్‌ కుమార్‌ హాజరై పర్యావరణ పతిజ్ఞ చేసి మొక్కలు నాటారు.

గోదావరిఖని, జూలై 17(ఆంధ్రజ్యోతి): వనమహోత్సవంలో భాగంగా సింగరేణి ఆర్‌జీ-1 ఏరియా ఆధ్వర్యంలో గురువారం జీడీకే ఓసీపీ-5 ఓబీ డంప్‌పైన వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మక్కాన్‌ి సంగ్‌ రాజ్‌ ఠాకూర్‌, ఆర్‌జీ-1 జీఎం డీ లలిత్‌ కుమార్‌ హాజరై పర్యావరణ పతిజ్ఞ చేసి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్‌జీ-1 ఏరియా ఆధ్వర్యంలో ఈ వర్షాకాలంలోగా 4లక్షల మొక్కలను నాటాలని నిర్దేశిం చినట్లు తెలిపారు. గురువారం ఓబీ డంప్‌పై వెయ్యి మొక్కలను నాటామ న్నారు.

పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం నుంచి రక్షణగా ఉండేలా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేష్‌, దీటి బాలరాజు, శ్రీనివాస్‌, పెద్దేల్లి తేజస్విని, ప్రకాష్‌, కొలిపాక సుజాత, పాతపెల్లి ఎల్లయ్య, సింగరేణి అధికారులు ఆంజనేయ ప్రసాద్‌, సీఎంఓఏఐ ప్రతినిధి మల్లేష్‌, ఏఐటీయూసీ నాయకులు మధన మహేష్‌, ప్రాజెక్టు అధికారి డీ రమేష్‌, డీజీఎం(ఫారెస్ట్‌) బానోతు కర్ణ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 11:41 PM