ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్థానిక ఎన్నికలకు సిద్ధంకావాలి

ABN, Publish Date - Jul 04 , 2025 | 11:47 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి పేర్కొ న్నారు. పట్టణంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో శుక్రవారం బీజేపీ రూరల్‌ కమిటీ అధ్య క్షుడు కందుల శ్రీనివాస్‌ అధ్యక్షతన కార్యకర్తలు, నాయకుల సమావేశం నిర్వహించారు.

సుల్తానాబాద్‌, జూలై 4 (ఆంధ్ర జ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి పేర్కొ న్నారు. పట్టణంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో శుక్రవారం బీజేపీ రూరల్‌ కమిటీ అధ్య క్షుడు కందుల శ్రీనివాస్‌ అధ్యక్షతన కార్యకర్తలు, నాయకుల సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో గుజ్జుల మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించని కాంగ్రెస్‌ స్థానిక సంస్థల ఎన్నికలంటే భయపడుతుందని, ప్రజలు ఎవరూ కాంగ్రెస్‌కు ఓట్టు వేయడానికి సిద్ధంగా లేరన్నారు. ఎన్నికల హామీలు ఎమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, రిజర్వేషన్లపై చట్ట బద్దమైన నిర్ణయం తీసుకుంటారా లేదా తేల్చాలని డిమాండ్‌ చేశారు.

గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కల్పించగా ఇప్పుడు నలభై శాతం ఉండాలని డిమాండ్‌ చేస్తోం దన్నారు. అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా మాట్లాడడం బీఆర్‌ఎస్‌కే చెల్లిందన్నారు. పదకొం డేళ్ళుగా నరేంద్ర మోదీ ప్రఽధానిగా దేశాన్ని అవినీతి కుంభకోణాలకు అతీతంగా పాలిస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికలలో బీజేపీ శ్రేణులు సుల్తానా బాద్‌ మున్సిపాలిటీతో పాటు మండలం లోని అన్ని స్థానాలను కైవసం చేసు కోవాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కర్రె సం జీవరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు గొట్టెము క్కుల సురేష్‌ రెడ్డి, మీస అర్జున్‌రావు, లింగారెడ్డి, కడారి అశోక్‌ రావు, కన్నం అంజయ్య, రఘుపతిరావు, కొమ్ము తిరుపతి, సౌదరి మహేందర్‌ యాదవ్‌, వనజ, నీరజ, పాల్గొన్నారు. నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు.

Updated Date - Jul 04 , 2025 | 11:47 PM