ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నష్టపోయిన రైతులకు ఉచిత న్యాయసాయం

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:34 AM

వ్యాపారులు, మధ్యదళారులు, విత్తన కంపెనీల వల్ల నష్టపోయిన రైతాం గానికి ఉచిత న్యాయం అందిస్తామని న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జడ్జి స్వరూపరాణి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం చట్టాలపై మండలంలోని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఓదెల, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): వ్యాపారులు, మధ్యదళారులు, విత్తన కంపెనీల వల్ల నష్టపోయిన రైతాం గానికి ఉచిత న్యాయం అందిస్తామని న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జడ్జి స్వరూపరాణి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం చట్టాలపై మండలంలోని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్జి స్వరూపరాణి మాట్లాడుతూ విత్త నాల వల్ల నష్టపోతే వినియోగదారుల ఫోరంలో కేసు ఎలా వేయాలో రైతు లకు అవగాహన ఉండాలన్నారు. విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేస్తే బిల్లులను తప్పనిసరిగా తీసుకోవాలని, బిల్లులు ఇవ్వని షాపుల్లో కొను గోలు చేయవద్దని తెలిపారు. మధ్య దళారులను సంప్రదించవద్దని, విత్త నాలు కొనుగోలు చేసే ముందు వ్యవసాయ శాఖ అధికారులను సంప్ర దించాలన్నారు. రైతులను మోసం చేసే వారిపై ఎలా కేసు వేయాలో రైతు లకు వివరించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉంటేనే సమాజంలో నేరా ల ప్రవృత్తి తగ్గుతుందని, తొందరగా న్యాయం అందుతుందని తెలిపారు. ఏడిఏ శ్రీనాథ్‌, ఏవో భాస్కర్‌, ఆర్‌ఐ,ఏఈఓ, అడ్వకేట్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:34 AM