ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కనీస విద్యా ప్రమాణాలపై దృష్టి సారించాలి

ABN, Publish Date - Aug 02 , 2025 | 12:02 AM

ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా ఉపాధ్యా యులు దృష్టి సారించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రామగుండం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహిం చారు. ఆయన పలువురు ఉపాధ్యాయుల నుంచి విద్యా ర్థులకు మెరుగైన విద్య కోసం పలు సలహాలు, సూచ నలు స్వీకరించారు.

పెద్దపల్లి కల్చరల్‌, ఆగస్టు1(ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా ఉపాధ్యా యులు దృష్టి సారించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రామగుండం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహిం చారు. ఆయన పలువురు ఉపాధ్యాయుల నుంచి విద్యా ర్థులకు మెరుగైన విద్య కోసం పలు సలహాలు, సూచ నలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో రోజు పిల్లలకు ఏఐ ల్యాబ్‌లో కనీసం 20 నిమిషాల పాటు ఉండేలా షెడ్యూల్‌ రూపొందించాలన్నారు. విద్యార్థుల ప్రమాణా లు పెంచేలా ఏఐ టూల్స్‌ వినియోగంపై ఉపాధ్యాయులు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. రాబోయే ఐదేళ్లపాటు ఎలాంటి మార్పులు ఉండకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా కృత్యా లను రూపొందించుకోవాలని తెలిపారు. కనీ సం 40 శాతం విద్యార్థులు బాగా చదివి, రాయడం వచ్చేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. విద్యార్థులకు వర్క్‌బుక్‌ ఉపయోగం చేయాలన్నారు. పిల్లల్లో స్కిల్స్‌ పెరిగితే గణితం, సైన్స్‌, సోషల్‌ బాగా అర్థం చేసుకునే వీలుంటుందని తెలిపారు. బేసిక్‌ విద్యాప్రమాణాలపై ఉపాధ్యాయులు దృష్టి సారిం చాలని ఆదేశించారు. కార్పొరేషన్‌ పరిధిలో పాఠశాలల అభివృద్ధి పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తామని తెలి పారు. పాఠశాలకు సంబంధించిన సంపూర్ణ వివరాలు యూఐడిసీ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లా విద్యాధికారి మాధవి, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:02 AM