ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్లు నడిపితే జరిమానా

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:16 AM

రోడ్లపై ట్రాక్టర్లు కేజ్‌వీల్స్‌తో తిరిగితే జరిమానా తప్పదని ఎంపీడీవో కలికోట రామ్‌మోహనచారి తెలిపారు. బుధవారం గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బందితో ఎంపీడీవో సమావేశం నిర్వహించారు. ట్రాక్టర్‌ కేజ్‌ వీల్స్‌తో రోడ్డుపై తిరిగితే మొదటిసారి రూ.5వేలు, రెండోసారి రూ.10 వేలు, మూడోసారి రూ.20వేల జరిమానాతోపాటు ట్రాక్ట ర్‌ సీజ్‌ చేస్తామన్నారు.

పాలకుర్తి, జూలై 2(ఆంధ్రజ్యోతి): రోడ్లపై ట్రాక్టర్లు కేజ్‌వీల్స్‌తో తిరిగితే జరిమానా తప్పదని ఎంపీడీవో కలికోట రామ్‌మోహనచారి తెలిపారు. బుధవారం గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బందితో ఎంపీడీవో సమావేశం నిర్వహించారు. ట్రాక్టర్‌ కేజ్‌ వీల్స్‌తో రోడ్డుపై తిరిగితే మొదటిసారి రూ.5వేలు, రెండోసారి రూ.10 వేలు, మూడోసారి రూ.20వేల జరిమానాతోపాటు ట్రాక్ట ర్‌ సీజ్‌ చేస్తామన్నారు. తహసీల్దార్‌ జేరుపోతుల సునీ త, మండల వ్యవసాయశాఖ అధికారి బండి ప్రమోద్‌ కుమార్‌, ఎస్‌ఐ స్వామి, రైతులు పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్‌, (ఆంధ్రజ్యోతి): తారురోడ్డుపై కేజ్‌ వీల్స్‌తో ట్రాక్టర్లు నడిపిస్తే జరిమానా విధించనున్నట్లు తహసీల్దార్‌ పుల్లూరి జగదీశ్వర్‌రావు తెలిపారు. ట్రాక్టర్ల యజమానులతో కార్యాలయంలో మాట్లాడారు. ప్రభు త్వం కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయిస్తే ట్రాక్టర్లు నడిపే వారు కేజ్‌వీల్స్‌ను ఉపయోగించి ధ్వంసం చేయడం సరి కాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నడిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన గ్రామస్థులను కోరారు.

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): రోడ్ల పై కేజ్‌వీల్స్‌తో ఉన్న ట్రాక్టర్లను నడిపించడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీ ల్దార్‌ బషీరొద్దిన్‌, ఎంపీడీఓ దివ్యదర్శన్‌రావు హెచ్చరిం చారు. మండల పరిషత్‌ కార్యాలయంలో రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేజ్‌వీల్స్‌ నడపించడం వలన కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్లు ధ్వంసం అవుతున్నాయని అవగాహన కల్పించారు. ఎంపీఓ సమ్మిరెడ్డి, ఈజీఎస్‌ ఏపీఓ మల్లీశ్వరి,ఏఎస్‌ఐ కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:16 AM