ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే చెల్లించాలి

ABN, Publish Date - Jul 08 , 2025 | 12:33 AM

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని సోమవారం విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు.

పెద్దపల్లి కల్చరల్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని సోమవారం విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్లసందీప్‌, జిల్లాల ప్రశాంత్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా, విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు.

ఆరేళ్ల నుంచి విద్యార్థులకు రావాల్సిన రూ.8 వేల కోట్ల పెండింగ్‌ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, యాజమాన్యాలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా బలవంతంగా ఫీజులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పెండింగ్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నాయకులు అరవింద్‌, నరేష్‌, అఖిల్‌, అభిలాష్‌, ఓంకార్‌, వినయ్‌, అభివర్దన్‌, కావ్య, హాలియా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 12:33 AM