రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:51 PM
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయ మని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తెలిపారు. రాఘవపూర్, రంగాపూర్, సబ్బితం, అందుగులపల్లి గ్రామాల్లో అప్పన్న పేట సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురు వారం ప్రారంభించారు.
పెద్దపల్లి టౌన్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయ మని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తెలిపారు. రాఘవపూర్, రంగాపూర్, సబ్బితం, అందుగులపల్లి గ్రామాల్లో అప్పన్న పేట సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురు వారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొను గోలు చేస్తామన్నారు. సన్న వడ్లకు క్వింటా లుకు 5 వందల రూపాయలు బోనస్ కొనసా గుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కె ట్ చైర్మన్ ఈర్ల స్వరూప, సింగిల్ విండో చైర్మన్ చింతపండు సంపత్, కార్యదర్శి గడ్డి తిరుపతి, డైరెక్టర్లు, నాయకులు ఆడెపు వెంక టేష్, తోట శ్రీనివాస్, గంట రమేష్, మహేందర్, సారయ్య, పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): త్వరలోనే అన్ని గ్రామాలలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. శాస్ర్తినగర్‌లో సహ కార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారం భించారు. ఎమ్మెల్యే మాట్లా డుతు ఈ సీజన్‌లో కూడా సన్న వడ్లకు బోనస్ వర్తి స్తుందని, కొనుగోలు కేంద్రా లను రైతులు సద్వినియో గం చేసుకోవాలని, 48 గం టల్లో రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయ న్నారు. త్వరలోనే అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళు మంజూ రు చేస్తామని చెప్పారు. సింగిల్ విండో చైర్మ న్ శ్రీగిరి శ్రీనివాస్, సీఈఓ బూరుగు సంతోష్, విండో డైరక్టరు,్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహేందర్, వేగోళం అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్, రాజలింగం ఉన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 11:51 PM