ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి

ABN, Publish Date - Jul 18 , 2025 | 11:36 PM

కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని సప్తగిరికాలనీలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాల, కళాశాలలో ఎమ్మెల్యే మొక్క నాటారు.

కోల్‌సిటీటౌన్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని సప్తగిరికాలనీలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాల, కళాశాలలో ఎమ్మెల్యే మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సప్తగిరికాలనీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

కానీ ప్రజాపాలనలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబుల సహకారంతో సప్తగిరికాలనీతోపాటు నియోజకవర్గంలో అభివృద్ధి రోడ్లు, డ్రైనేజీ చేస్తున్నామన్నారు. మానవ మనుగడకు చెట్లు ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటిస్థానంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని, ఆ దిశగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌, కార్పొరేషన్‌ ఇన్‌చార్జీ కమిషనర్‌ అరుణశ్రీ, మెప్మా మహిళలు, విద్యార్థులు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 11:36 PM