ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మానవ అక్రమ రవాణా నిర్మూలన అందరి బాధ్యత

ABN, Publish Date - May 28 , 2025 | 11:59 PM

మానవ అక్రమ రవాణా నిర్మూ లించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని డీఈవో మాధవి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల సమావేశ మందిరంలో బుధ వారం ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన మండలి సంస్థ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న రెండురోజుల శిక్షణ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించి మాట్లాడారు.

పెద్దపల్లి కల్చరల్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణా నిర్మూ లించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని డీఈవో మాధవి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల సమావేశ మందిరంలో బుధ వారం ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన మండలి సంస్థ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న రెండురోజుల శిక్షణ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించి మాట్లాడారు. మానవ అక్రమరవాణా అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంద న్నారు. ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరిత మైన చర్య అని, పేద, మధ్యతరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా గురవుతున్నారన్నారు. పాఠశాలలో పేరెంట్స్‌ మీటింగ్స్‌లలో వారికి అవగాహన కల్పించాలన్నారు. సైబర్‌ ట్రాఫికింగ్‌ వేగంగా విస్తరిస్తోందని, పిల్లలకు ఫోన్‌ ఉపయోగించడం ద్వారా వచ్చే నష్టాలను తెలుపాలన్నారు. మాయమాటలు, ఉద్యోగం, సినిమా అవకాశం అంటూ పట్టణాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహాల లో అమ్ముతున్నారని, జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు అవగాహన కలిగి ఉండి అప్రమత్తం చేయడం ద్వారా నిర్మూలించవచ్చన్నారు. ప్రజ్వల సీనియర్‌ ప్రాజెక్టు మేనేజర్‌ బలరామకృష్ణ మాట్లాడుతూ రోజు ఎంతోమంది అమ్మా యిలు, మహిళలు మానవ అక్రమ రవాణా బారిన పడుతున్నారన్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటివరకు 30వేల మందిని కాపాడామని, ఇందులో చిన్నపిల్లలు, యువతులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారన్నారు. సైబర్‌ ట్రాఫి కింగ్‌ ద్వారా అక్రమరవాణా పెరిగిపోయిందని, ముఖ్యంగా విద్యార్థులు పర్స నల్‌ ఫోటోలు, వీడియోలు పంపడం ద్వారా సెక్స్‌ ట్రాఫికింగ్‌కి గురవుతు న్నారన్నారు. ఈ శిక్షణలో చట్టాలు, పోలీస్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు 1098, 100, 181, 1930, 181ల గురించి వివరించారు. జిసిడిపిఓ కవిత, హెచ్‌ఎం అరుణ, ప్రజ్వల సిబ్బంది, కేజీడీవీ గురుకుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:10 PM