ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు కృషి చేయాలి
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:16 AM
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ను అందరం బాధ్యతగా కృషిచేయాలని, మండల టాపర్లుగా నిలిచిన వారు పాఠశాలల్లో ప్రవేశాలు జరిగేలా అంబాసిడర్స్‌గా వ్యవహరించాలని ఉపా ధ్యాయ శాసనమండలి సభ్యులు పింగలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేం ద్రంలోని ఎంబి గార్డెన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రవేశాలు అధికంగా అయ్యేలా చూడాలని కోరారు.
పెద్దపల్లి కల్చరల్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ను అందరం బాధ్యతగా కృషిచేయాలని, మండల టాపర్లుగా నిలిచిన వారు పాఠశాలల్లో ప్రవేశాలు జరిగేలా అంబాసిడర్స్‌గా వ్యవహరించాలని ఉపా ధ్యాయ శాసనమండలి సభ్యులు పింగలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేం ద్రంలోని ఎంబి గార్డెన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రవేశాలు అధికంగా అయ్యేలా చూడాలని కోరారు. పీఆర్‌టీయు టీఎస్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా అవార్డుల ప్రదానంతో పాటు వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. ఎమ్మెల్సీ మాట్లా డుతూ తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేలా చూడాల న్నారు. డీఈఓ డి.మాధవి మాట్లాడుతూ ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠ శాల విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు పీఆర్‌టీయు జిల్లా శాఖ అవార్డుల ప్రధాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లాశాఖ అధ్యక్షుడు కర్రు సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పీఆర్‌టీ యు రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, డీసీఈబీ సెక్రటరీ వి.హన్మంతు, బి.రవినందన్‌రావు, పాల్గొన్నారు. 37మంది విద్యార్థులు, వందశాతం ఉత్తీర్ణత సాధించిన 66పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, ఎంఈవోలను సర్టిఫికెట్, జ్ఞాపికతో సత్కరించారు.
Updated Date - Jun 05 , 2025 | 12:16 AM