ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్యులు కనిపించే దేవుళ్లు

ABN, Publish Date - Jul 02 , 2025 | 12:28 AM

కనిపించే దేవుళ్లు వైద్యులని ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు.

కళ్యాణ్‌నగర్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): కనిపించే దేవుళ్లు వైద్యులని ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. కరోనా సమయంలో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయ కుండా ప్రజలను కాపాడారని, వైద్యులు దేవుళ్లతో సమానమన్నారు. వైద్యులను ఘనంగా సన్మానించారు.

వైద్యులు అనీల్‌ కుమార్‌, మోహన్‌రావు, లక్ష్మీప్రసాద్‌, లక్ష్మీవాణి, అశోక్‌, నాగిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, దయానంద్‌, నరేష్‌ పాల్గొన్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో వైద్యులను సన్మానించారు. సూపరింటెండెంట్‌ దయాల్‌సింగ్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఆర్‌ఎంఓ రాజు, వైద్యులు శ్రీదేవి, శిరీష, శ్రీనివాస్‌, నిషాన్‌, పీఆర్‌ఓ కృష్ణ పాల్గొన్నారు. లయన్స్‌క్లబ్‌ స్ఫూర్తి ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం సం దర్భంగా లయన్స్‌క్లబ్‌ స్ఫూర్తి అధ్యక్షుడు మామిడిపెల్లి శ్రీధర్‌ ఆధ్వర్యంలో వైద్యులు విజేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్‌, దుర్గాప్రసాద్‌, అనీల్‌ కుమార్‌, అరుణ్‌కుమార్‌, అనుశ్రీలను సన్మానించారు.

Updated Date - Jul 02 , 2025 | 12:28 AM