అస్తవ్యస్తంగా జిల్లా విద్యా శాఖ
ABN, Publish Date - Jul 20 , 2025 | 12:23 AM
జిల్లా విద్యా శాఖ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడడంతో విద్యా ర్థులు, వారి తల్లితండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ సుదీర్ఘ కాలంగా డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి పని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లా విద్యా శాఖ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడడంతో విద్యా ర్థులు, వారి తల్లితండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ సుదీర్ఘ కాలంగా డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి పని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ప్రభుత్వ పాఠశాలలను సక్రమంగా పర్యవేక్షిం చక పోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నదని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘించినా వాటిపై చర్యలకు ఉపక్రమించడం లేదనే విమర్శలున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 559 ఉండగా, ప్రైవేట్ పాఠశాలలు 166 వరకు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్య అధి కంగా ఉంది. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఏడాది కాలంలో సందర్శించిన పాఠశాలల్లో, 45 నెలలుగా ఇక్కడ పని చేస్తున్న డీఈవో సగం పాఠశాలలను కూడా సంద ర్శించ లేదనే అపవాదు ఉంది. కలెక్టర్ ఒక మండలానికి వెళితే అందులో కనీసం ఐదారు పాఠశాలలను సందర్శి స్తుంటారు. పాఠశాలల్లో మౌలిక వసతులపై దృష్టి సారించి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పనులు చేయిం చారు. కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాల యాల్లో వేడి నీటి సౌకర్యం కల్పించారు. విద్యార్థులతో మాట్లాడి వారు బోధనా పరంగా, మౌలిక వసతుల పరంగా పడుతున్న ఇబ్బందులు తెలుసుకుంటున్నారు. రెగ్యులర్‌గా పర్యవేక్షించాల్సిన డీఈవో పాఠశాలలను సందర్శించడం లేదనే విమర్శలున్నాయి.
జిల్లాలో 166 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, ఇందులో 47 వేల మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తు న్నారు. జీఓ నంబర్ 1 ప్రకారం పాఠశాలలు ఉండాలి. సగం పాఠశాలల్లో మాత్రమే ఆ మేరకు వసతులు న్నాయి. కొన్నింటిలో క్రీడా మైదానాలు లేకపోవడంతో పాటు ఇరుకు గదులున్నాయి. పాఠశాలల ఆరంభ సమయంలో ప్రార్థన చేసేందుకు కూడా స్థలం లేదు. పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్కులు, టై, బెల్టులు, యూని ఫామ్‌లు, స్టడీ మెటీరియల్ మొత్తం ప్రైవేట్ పాఠశాలల యజమానులే విక్రయిస్తున్నారు. బయటకంటే అడ్డగోలు ధరలకు అంటగట్టి అదనంగా లాభ పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా కూడా, వీరి వ్యవహారంపై విద్యార్థి సంఘాల నాయకులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా విద్యాశాఖాధికారులు పట్టించుకోవ డం లేదు. వాళ్లు నిర్వహిస్తే వార్షికోత్సవ, ఇతర కార్యక్ర మాలకు హాజరయ్యేందుకు ప్రాధాన్యమిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలకు సమయం కేటాయించడం లేదనే విమర్శలున్నాయి.
ఫకలెక్టర్ సమావేశం పెట్టినా కూడా..
జిల్లా విద్యా శాఖ పని తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో కలెక్టర్ విద్యాశాఖ అధికారులు, సిబ్బందితో సమావేశం పెట్టినా వారి పని తీరు మార డం లేదు. కలెక్టర్ కోయ శ్రీహర్ష గత నెల 20వ తేదీన జిల్లా విద్యా శాఖలో పని చేసే అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కార్యాలయ పని తీరు మార్చుకోవాలని కలెక్టర్ హెచ్చరించారని తెలిసింది. కొన్ని ముఖ్యమైన పైళ్లను మాత్రమే పరిశీలించి, కొన్నిం టిని పరిశీలించకపోవడంపై ప్రస్తావించినట్లు సమాచా రం. అయినా కూడా విద్యా శాఖ తీరు మారడం లేదని, కొన్ని ఫైళ్లు ముందుకు కదలడం లేదని తెలుస్తున్నది. కలెక్టర్ సమావేశం నిర్వహించిన తర్వాత రెండు రోజుల తర్వాత డీఈవో వ్యక్తిగత కారణాల వల్ల సెలవుపై వెళ్లారు. ఆ సమయంలోనే కలెక్టర్ ఆయా పాఠశాలల్లో ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను, కొరత ఉన్న పాఠశాలలకు దాదాపు 83 మంది ఉపాధ్యాయులను ఒకటి, రెండు రోజుల్లోనే సర్దుబాటు చేసి ఆర్డర్లు ఇచ్చారు. కొన్ని పైళ్లను పరిశీలించి ఆ పనులు జరిగేలా చేసినట్లు సమాచారం. సెలవుల నుంచి డీఈవో తిరిగి వచ్చిన తర్వాత నామమాత్రంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. చాలా జిల్లాలో రెగ్యులర్ డీఈవోల కొరత ఉండగా, ఏడీలకు డీఈవోలు అదనపు బాధ్యతలు ఇస్తున్నారు. కరీంనగర్ డీఈవో కార్యాలయంలో ఏడీగా పని చేసిన మాధవికి పెద్దపల్లి డీఈవోగా 2021 సెప్టెంబర్ 16న అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐదు మాసాల క్రితం ప్రభుత్వం శారద అనే అధికారికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి పెద్దపల్లికి బదిలీ చేశారు. అయితే ఆమెకు డీఈవోగా అదనపు బాధ్యతలు ఇవ్వకుండా కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్‌ను కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ డీఈవోలు లేని చోట అక్కడే అసి స్టెంట్ డైరెక్టర్లుగా పని చేస్తున్న వారికి డీఈవోగా అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. కానీ ఇక్కడ పని చేస్తున్న ఏడీకి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించక పోవడంలో మతలబు ఏమిటోనని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి జిల్లా విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు.
Updated Date - Jul 20 , 2025 | 12:23 AM