గైర్హజరైన ఉద్యోగులకు కౌన్సెలింగ్
ABN, Publish Date - Jul 18 , 2025 | 11:34 PM
గోదా వరిఖని ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఆర్‌జీ-1 ఏరియా గనులు, డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన 378 మంది గైర్హాజరు ఉద్యోగులకు శుక్రవారం కౌన్సె లింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు 109మంది హాజరయ్యారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ హాజరై గైర్హాజరైన ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వ హించారు.
గోదావరిఖని, జూలై 18(ఆంధ్రజ్యోతి): గోదా వరిఖని ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఆర్‌జీ-1 ఏరియా గనులు, డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన 378 మంది గైర్హాజరు ఉద్యోగులకు శుక్రవారం కౌన్సె లింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు 109మంది హాజరయ్యారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ హాజరై గైర్హాజరైన ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వ హించారు. జీఎం మాట్లాడుతూ ప్రస్తుత పరి స్థితులలో ఉద్యోగం ఆవశ్యకత గురించి తెలి పారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే సింగరేణి ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలని, దీని వలన ఉద్యోగం కాపాడుకున్నవారవుతారని తెలిపారు.
ఉద్యోగులు విధులకు హాజరై నిర్దేశి త మస్టర్లను పూర్తి చేయాలని, 3సంవత్సరాల గైర్హాజరు మస్టర్లను పరిగణలోకి తీసుకొని విధుల నుంచి తొలగిస్తామన్నారు. ఉద్యోగులు మరే ఇతర సమస్యలైనా పరిష్కరించడానికి యాజమాన్యం తోడ్పాటునందిస్తుందని పేర్కొ న్నారు. గైర్హాజర్ ఉద్యోగుల సమస్యలను తెలు సుకొని పరిష్కారమార్గం చూపిం చారు. 2024లో 100 మస్ట ర్లు నిండని ఉద్యోగులకు, ఈ సంవత్సరం 50మస్టర్లు నిండని వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్‌ఓటు జీఎం ఆంజనేయప్రసాద్, ఏఐటీయూసీ డిప్యూ టీ జనరల్ సెక్రటరీ ఎల్లయ్య, సీఎంఓఐఏ వైస్ ప్రసిడెంట్ శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్ రవీం దర్ రెడ్డి, డాక్టర్ స్రవంతి, డిప్యూటి పర్సనల్ మేనేజర్ వేణు, పాల్గొన్నారు.
Updated Date - Jul 18 , 2025 | 11:34 PM