బాల్య వివాహాలను అరికట్టాలి
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:26 AM
బాల్య వివాహాలను అరికట్టాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి బాల్య వివాహాల రహిత జిల్లాగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు చందన తెలి పారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లా డుతూ జిల్లాలో బాల్య వివాహాలను నివారించేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు.
పెద్దపల్లి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను అరికట్టాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి బాల్య వివాహాల రహిత జిల్లాగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు చందన తెలి పారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లా డుతూ జిల్లాలో బాల్య వివాహాలను నివారించేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, స్కానింగ్ సెంటర్ల పై నిఘా పెట్టాలని ఆదేశించారు. బాలల హక్కులపై పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను అధికారులు తనిఖీ చేయా లన్నారు. బాల కార్మికులను గుర్తించి పునరావాసం కల్పించాలని అన్నారు. పిల్లలు బిక్షాటనలో ఉండకుండా చూడాలన్నారు. చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉన్నవారికి అవసరమైన శస్త్ర చికిత్సలు పూర్తి చేయడం, వినికిడి లోపం ఉన్న పిల్లలకు యంత్రాలు అందించాలన్నారు. అనాథ పిల్లలు, సెమీఅర్బన్ పిల్లల వివరాలు సేకరించి ప్రవేశ పరీక్ష లేకుండా గురుకులాలో చేర్పించామని అధికారులు తెలిపారు. డీసీపీ కరుణాకర్, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు, డీఎంహెచ్‌వో అన్న ప్రసన్న కుమారి, ఏసీపీలు కృష్ణ, రమేష్ పాల్గొన్నారు.
పెద్దపల్లి కల్చరల్, (ఆంధ్రజ్యోతి): పిల్లల ఎదుగుదలలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తాయని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు చందన తెలిపారు, 8వ వార్డులో అంగన్‌వాడీ కేంద్రాన్ని సం దర్శించి పిల్లలకు ఎగ్ బిర్యానీ పంపిణీని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పిల్లలకు ప్రీ స్కూల్ విద్య పోషకాహారం, ఆరోగ్య సంరక్షణలో సేవలందిస్తూ విద్య, సామాజిక అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్, సీడీపీఓ కవిత, సూపర్‌వైజర్ ప్రేమ లత, టీచర్లు స్వరూప, రేఖ, రజిత, సుజాత పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 12:26 AM