డుమ్మా కొట్టే ఉద్యోగులకు చెక్..
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:29 AM
జిల్లాలోని మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల అధికారులు, ఉద్యోగుల సేవలను పారదర్శకంగా అందించేం దుకు బయో మెట్రిక్‌తోపాటు ముఖ ఆధారిత గుర్తింపు విధానం (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం) ద్వారా హాజరును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అమల్లోకి తీసుక వచ్చింది.
పెద్దపల్లి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల అధికారులు, ఉద్యోగుల సేవలను పారదర్శకంగా అందించేం దుకు బయో మెట్రిక్‌తోపాటు ముఖ ఆధారిత గుర్తింపు విధానం (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం) ద్వారా హాజరును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అమల్లోకి తీసుక వచ్చింది. ఈ విధానం గత నెల 16వ తేదీ నుంచే అమ ల్లోకి రావాల్సి ఉండగా, పరికరాలు ఆలస్యంగా రావడంతో వాటిని మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో బిగిస్తున్నారు. జిల్లాలో 14 మండలాలు ఉండగా, ఒకటి అర్బన్ మండలంపోనూ 13 రూరల్ మండలాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ కార్యాలయంతోపాటు 13 మండల పరిషత్ కార్యాలయాల్లో బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ పరికరాలను బిగిస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా కార్యాలయాలకు వస్తున్నట్లు గుర్తించిన పంచా యతీరాజ్ శాఖ ఈ విధానాన్ని తీసుకవచ్చింది. ఇక నుంచి ఉద్యోగులు కార్యాలయానికి వచ్చిన వెంటనే వేలి ముద్రలు వేసి ఫేస్ రికగ్నిషన్ పూర్తి చేసి హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మరోసారి హాజరు వేసుకోవాలి. ఉద్యోగులు సమయపాలన పాటించడంతో పాటు విధుల్లో పార దర్శకతకు దోహద పడనున్నది. ఒక్కో పరికరానికి 16 వేల రూపాయల వరకు వెచ్చించినట్లు సమా చారం. అన్ని కార్యా లయాల్లో పరికరాలు అమర్చిన తర్వాత ఉద్యోగుల వివరాలు, ఆధార్ కార్డు, ఇత రత్రా వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానున్నదని, ఆ తర్వాత బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అమల్లోకి రానున్నదని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె నరేందర్ తెలిపారు.
Updated Date - Jul 02 , 2025 | 12:29 AM