పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్‌ఎస్
ABN, Publish Date - Jun 16 , 2025 | 12:13 AM
పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిందని ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
కళ్యాణ్‌నగర్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిందని ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదని, కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత 59వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, గృహలక్ష్మి, రూ.500లకే వంట గ్యాస్, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలు వేగవంతంగా జరుగుతుందని, రైతులకు ఏక కాలంలో రుణమాఫీతోపాటు రైతుభరోసా కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చారని, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని, పుట్టి పెరిగిన గోదావరిఖని ప్రాంతంలో మక్కాన్‌సింగ్‌తో కలిసి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. విలేకరుల సమావేశంలో బొంతల రాజేష్, కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, తిప్పారపు శ్రీనివాస్, తౌటం సతీష్, ముస్తాఫా, కొలిపాక సుజాత, నాయిని ఓదెలు, గుండేటి రాజేశ్, తాళ్లపల్లి యుగంధర్ పాల్గొన్నారు.
మంత్రికి ఘన స్వాగతం
మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి గోదావరిఖనికి వచ్చిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ జంక్షన్ వద్ద మంత్రికి ఘన స్వాగతం పలికి గజమాలను వేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ టీ జంక్షన్ నుంచి క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జవహర్‌నగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. కొప్పుల శంకర్, మండ రమేష్, కళ్యాణి సింహాచలం, బాల రాజ్‌కుమార్, దాసరి ఉమ, పాల్గొన్నారు.
Updated Date - Jun 16 , 2025 | 12:13 AM