ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

ABN, Publish Date - Jul 20 , 2025 | 12:14 AM

రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటా లని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, నిజామాబాద్‌ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నాహక కార్యశాల నిర్వహించారు.

పెద్దపల్లి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటా లని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, నిజామాబాద్‌ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నాహక కార్యశాల నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలో చర్చించడమే ప్రధాన ఎజెండాగా కార్యశాల నిర్వహించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్లను కైవసం చేసుకునే విధంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాలు, హామీలు అమలు చేయక పోవడంపై ఇంటింటి ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ద్వారా తెలంగాణ గ్రామాభివృద్ధి సాకారమైందని ప్రజలకు తెలియజేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి, పెద్దపల్లి మాజీ ఎంపీ, జిల్లా ఎన్నికల ప్రభారీ వెంకటేశ్‌ నేత, స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్‌ సునీల్‌రెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్‌ ఇన్‌చార్జి గోమాస శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పర్వతాలు సురేష్‌ రెడ్డి నారాయణరెడ్డి, కందుల సంధ్యారాణి, సోమవారం లావణ్య, పాల్గొన్నారు

Updated Date - Jul 20 , 2025 | 12:14 AM