ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘భూ భారతి’కి అర్జీల భారం

ABN, Publish Date - Jun 25 , 2025 | 12:37 AM

గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో అనేక ఇబ్బందులు, అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదులతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం భూ భారతితో రైతుల సమస్యలు తీరుతాయని ఆశలు పెట్టుకున్నారు.

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల )

గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో అనేక ఇబ్బందులు, అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదులతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం భూ భారతితో రైతుల సమస్యలు తీరుతాయని ఆశలు పెట్టుకున్నారు. ఈనెల 2న అమలులోకి వచ్చిన భూభారతి చట్టంలో దరఖాస్తులు చేసుకోవడానికి ఈనెల 3 తేదీ నుంచి 20 వ తేదీ వరకు దాదాపు 18 రోజులపాటు నిర్వహించిన సదస్సులకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ స్పందన వచ్చింది. తమ భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకంతో రైతులు దరఖాస్తులు చేసుకున్నారు.

సదస్సులకు భారీ స్పందన

భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఈనెల 3తేదీ నుంచి 16 తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 167 రెవెన్యూ గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. 17నుంచి 20వ తేదీ వరకు తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తులు తీసుకున్నారు. జిల్లాలో భూ సమస్యలపై 6787 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో మిస్సింగ్‌ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు, సాదా బైనామాలు, కోర్టు కేసులు, ఒకరి భూములు మరొకరిపై నమోదు కావడం, పెండింగ్‌ మ్యుటేషన్‌ తదితర సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు. మిస్సింగ్‌ సర్వే నంబర్లకు సంబంధించి 1393 దరఖాస్తులు, పెండింగ్‌ మ్యుటేషన్‌కు 295 దరఖాస్తులు, డీఎస్‌ పెండింగ్‌లో 404 దరఖాస్తులు వచ్చాయి. భూమి విస్తీర్ణం, చేర్పులు మార్పులు సంబంధించి 2093 దరఖాస్తులు వచ్చాయి. నిషేధిత జాబితాలో భూములు నమోదు అయినట్లు సవరించడానికి 270 దరఖాస్తులు వచ్చాయి. అసైన్డ్‌ భూములు, భూసేకరణ, ఇతర రికార్డులకు సంబంధించిన సమస్యలపై 3489 దరఖాస్తులు వచ్చాయి.

సాదా బైనామాలు సమస్యలు తీరేనా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతోకాలంగా సాదాబైనామాల సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనే ప్రభుత్వం సాదా బైనామాల సమస్య పరిష్కరిస్తామని ప్రకటించిన ఆచరణలోకి రాలేదు. ఈసారైనా సమస్య తీరుతుందని భూభారతిలో మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. సదస్సులో జిల్లాలో 1675 సాదా బైనామాల సమస్యలపైనే దరఖాస్తులు వచ్చాయి. బోయిన్‌పల్లి మండలంలో 167, చందుర్తిలో 287, ఇల్లంతకుంటలో 200, గంభీరావుపేటలో 192, కోనరావుపేటలో 136, ముస్తాబాద్‌లో 306, సిరిసిల్లలో 13, తంగళ్ళపల్లిలో 75, వేములవాడలో 92, వేములవాడ రూరల్‌లో 82, వీర్నపల్లిలో 49, ఎల్లారెడ్డిపేటలో 76 దరఖాస్తులు వచ్చాయి. భూభారతి చట్టం పరిధిలో రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15లోపు పరిష్కరించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామాల వారీగా దరఖాస్తులను పరిశీలించి సంబంధిత రైతులకు నోటీసులు ఇస్తారు. రైతుల వద్ద ఉన్న భూ రికార్డులు ఇతర ఆధారాలు సేకరించి సమస్య పరిష్కారాన్ని చెబుతారు.

జిల్లాలో మండలాల వారిగా వచ్చిన దరఖాస్తులు

మండలం దరఖాస్తులు

బోయిన్‌పల్లి 662

చందుర్తి 1300

ఇల్లంతకుంట 858

గంబీరావుపేట 575

కోనరావుపేట 569

ముస్తాబాద్‌ 929

సిరిసిల్ల 113

తంగళ్లపల్లి 353

వేములవాడ 360

వేములవాడ రూరల్‌ 307

వీర్నపల్లి 376

ఎల్లారెడ్డిపేట 385

మొత్తం 6787

Updated Date - Jun 25 , 2025 | 12:37 AM