ఘనంగా భగీరథ జయంతి
ABN, Publish Date - May 04 , 2025 | 11:43 PM
జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా భగీరథ జయంతిని జరపడం హర్షనీయమన్నారు.
పెద్దపల్లి కల్చరల్, మే 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా భగీరథ జయంతిని జరపడం హర్షనీయమన్నారు. గంగను భువినుండి దివికి తీసుకువచ్చిన భగీరథ మహర్షి చరిత్ర ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భగీరథ సామాజిక వర్గానికి చెందిన ఉప్పరిసాగర కులస్తులు బీసీల ఐక్యతకు భగీరథ ప్రయత్నం జరపాలని పిలుపునిచ్చారు. ఆయా మహానీయుల ఉత్సవాలను కుల ఉత్సవాలుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్థార్‌పాపన్న, చాకలి ఐలమ్మ, కొండ లక్ష్మణ్ బాపూజీలు కులా లు, మతాలక తీతంగా సమాజ అభివృద్ధికి పోరా డారని తెలిపారు. వీరిని ఒక కులానికి, వర్గానికి పరిమితం చేయడం సరికాదన్నారు. నాగరికత పుట్టినప్పటి నుంచి సాగర ఉప్పరుల చరిత్ర నిర్మాణమైందన్నారు. నాయకులు లక్ష్మణ్, వెంకటేశం, శ్రీనివాస్, సాగర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 04 , 2025 | 11:43 PM