ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:28 AM

వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకా శం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండా లని రాఘవపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు మమత అన్నారు. శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయేరియా నిర్మూ లనపై గ్రామాల్లో 45 రోజులపాటు కార్యక్రమం చేపడుతున్నట్లు వైద్యురాలు తెలిపారు.

పెద్దపల్లి రూరల్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకా శం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండా లని రాఘవపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు మమత అన్నారు. శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయేరియా నిర్మూ లనపై గ్రామాల్లో 45 రోజులపాటు కార్యక్రమం చేపడుతున్నట్లు వైద్యురాలు తెలిపారు. వైద్యు రాలు మాట్లాడుతూ 5 ఏళ్ల లోపు పిల్లల్లో విరేచ నాలు నివారించడానికి గ్రామాల్లో వైద్య సిబ్బం ది ఇంటింటికి వెళ్లి ముందస్తుగా అవసరమైన ఓఆర్‌ఎస్‌ ద్రావణం అందించనున్నట్లు తెలిపా రు. చేతుల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తి గత శుభ్రతపై గ్రామాల్లో సిబ్బంది అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ముత్తారం, (ఆంధ్రజ్యోతి): మచ్చుపేటలో ఎంఎల్‌హెచ్‌పీ బొల్లం దీప్తి అతిసార వ్యాధిపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విరేచనాలు అయినప్పుడు పిల్లలకు ఓఆర్‌ఎస్‌ ద్వారా కోల్పోయిన ద్రవాలు, ఎలక్ర్టోలైట్లను అం దిస్తోందన్నారు. సిబ్బంది పుష్పలత, టీచర్‌ కళావతి, మాజీ సర్పంచ్‌ సతీష్‌ పాల్గొన్నారు.

పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): వర్షాల వల్ల గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జా గ్రత్తలు తీసుకోవాలని ఎంపీ డివో కలి కోట రామ్‌మోహన చారి అన్నారు. శుక్రవారం రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. డ్రైనేజీలలో పూడిక తీయా లని, వర్షపు నీరు రోడ్ల పై నిల్వ ఉండకుండ చూడా లని, గుంతలను పూడ్చివేయాలని, వర్షం నీరు చెరువు, కుంటలకు వెళ్లె విధంగా చూడాలని సూచించారు. ఎంపీవో ఉప్పు సుదర్శన్‌, పుట్నూ ర్‌, బసంత్‌నగర్‌ పిఎస్‌ వైద్యులు, అంగన్వాడి సూపర్‌వైజర్లు, టీచర్స్‌, ఏఎన్‌ఎంలు, మిషన్‌ భగీరథ ఏఈ, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:29 AM