ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాధితులకు అండగా ఉండాలి

ABN, Publish Date - May 30 , 2025 | 11:40 PM

పోలీస్‌స్టేష న్‌కు వచ్చే బాధితులకు అండగా ఉండాలని డీసీపీ కరుణాకర్‌ అన్నారు. శుక్రవారం పోత్క పల్లి పోలీస్‌స్టేషన్‌ ఆకస్మికంగా తనిఖీ నిర్వ హించారు. ముందుగా స్టేషన్‌ పరిసరాలు, వివిధ కేసులలో సీజ్‌ చేసిన వాహనాలను పరిశీలించారు.

ఓదెల, మే 30 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌స్టేష న్‌కు వచ్చే బాధితులకు అండగా ఉండాలని డీసీపీ కరుణాకర్‌ అన్నారు. శుక్రవారం పోత్క పల్లి పోలీస్‌స్టేషన్‌ ఆకస్మికంగా తనిఖీ నిర్వ హించారు. ముందుగా స్టేషన్‌ పరిసరాలు, వివిధ కేసులలో సీజ్‌ చేసిన వాహనాలను పరిశీలించారు. అనంతరం ఫిర్యాదుల వివ రాలు తెలుసుకొన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి, వారి సమస్యను తెలుసుకొని భరోసా కల్పించాలని, చట్టపరిధిలోని సమస్యలను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.

పోలీస్‌ అధికారులు, సిబ్బంది వివరాలను ఎస్‌ఐ రమేష్‌ను అడిగి తెలుసుకొన్నారు. స్టేషన్‌ పరిధిలో నేరాలు, సమస్యాత్మక గ్రామాల, రౌడీషీటర్లు, ట్రబుల్‌ మాంగర్స్‌ గురించి తెలుసుకున్నారు. గంజా యి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు నిరంతరం పనిచేయాలని కోరారు. నేరాల నియంత్రణకు విజుబుల్‌ పోలీసింగ్‌ అవస రమని, పెట్రోలింగ్‌ నిర్వహించాలని సూచిం చారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో మొక్కలు నాటారు. ఏసిపి జి కృష్ణ , పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:40 PM