ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పేమ, త్యాగానికి ప్రతీక బక్రీద్‌

ABN, Publish Date - Jun 07 , 2025 | 11:42 PM

ప్రేమకు, త్యాగానికి, సామరస్యానికి ప్రతీక బక్రీద్‌ అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా శనివారం శారదానగర్‌, ఫోరింక్లయిన్‌ ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

కళ్యాణ్‌నగర్‌, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ప్రేమకు, త్యాగానికి, సామరస్యానికి ప్రతీక బక్రీద్‌ అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా శనివారం శారదానగర్‌, ఫోరింక్లయిన్‌ ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ బక్రిద్‌ అనేది త్యాగానికి, విశ్వాసానికి, విధేయతకు ప్రతీక అని, ప్రవక్త ఇబ్రహీం కోసం త్యాగం, నిస్వార్థత, ధైర్యం, భక్తి అనే విలువలను గుర్తు చేస్తుందన్నారు. మనం పంచుకునే ప్రేమలో మానవత్వం ఉంటుందన్నారు. ముస్లీం మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని, మైనార్టీల కోసం విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో అనేక పథకాలు తీసుకువచ్చారని, మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుందన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఈద్గాలు, కబరస్తాన్‌ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినట్టు చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు మహంకాళి స్వామి, ఫజల్‌బేగ్‌, ముస్తాఫా, ఫకృద్దీన్‌, దాసరి సాంబమూర్తి, అశ్రఫ్‌, రహీం, ముస్తాఫా పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 11:42 PM